హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Singareni Jobs 2022: సింగరేణి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. అయితే పరీక్ష తేదీ.. దరఖాస్తు విధానం తెలుసుకోండి..

Singareni Jobs 2022: సింగరేణి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. అయితే పరీక్ష తేదీ.. దరఖాస్తు విధానం తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌(Singareni Collieries Company Limited) 177 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు 20th జూన్ 2022న రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. అయితే దీనిపై పరీక్ష తేదీని ఇటీవల వెల్లడించారు. ఆ వివరాలిలా..

ఇంకా చదవండి ...

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌(Singareni Collieries Company Limited) 177 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు 20th జూన్ 2022న రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ క్లరికల్‌ జాబ్‌ నాన్‌ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లోకి(Clerical Cadre Non Executive Cadre)వస్తుంది. జూన్ 20 నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు(Online Applications) స్వీకరిస్తున్నారు. జులై 10 వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. నోటిపికేషన్‌లో(Notification) పేర్కొన్న అర్హతలు, ఉద్యోగాల వారీగా ఖాళీలు, అప్లికేషన్ ఫీజు(Application Fee), ఎంపిక విధానం మొత్తం చూసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోవాలి. అయితే పరీక్ష తేదీని నోటిఫికేషన్లో పేర్కొనలేదు కానీ.. తాజాగా https://scclmines.com/scclnew/index.asp వెబ్ సైట్ లో పరీక్ష తేదీని వెల్లడించారు. సెప్టెంబర్ 4, 2022 న పరీక్షను నిర్వహించనున్నట్లు వెబ్ సైట్ లో పేర్కొన్నారు. దీనికి కోసం ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

Govt Internships: ఇంటర్న్‌షిప్ ఆఫర్స్ కోసం చూస్తున్నారా..? ఈ గవర్నమెంట్ ఇంటర్న్‌షిప్స్ లిస్ట్ మీకోసమే..!

సంక్షిప్తంగా ఉద్యోగ వివరాలు ఇలా..

ఉద్యోగం ఇచ్చే సంస్థ పేరు- సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌

పోస్ట్ పేరు - జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ II

ఖాళీల సంఖ్య- 177

అప్లికేషన్ స్వీకరణ తేదీ- 20th జూన్ 2022

అప్లికేషన్ స్వీకరణకు ఆఖరు తేదీ- 10th జులై 2022

అప్లై చేసుకునే విధానం- ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

అప్లిచేయాల్సిన వెబ్ సైట్- scclmines.com

దరఖాస్తును ఇలా చేసుకోండి..

స్టెప్ 1 : మొదట అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.

స్టెప్ 2 : వెబ్ సైట్ ఓపెన్ కాగానే టాప్ లో కెరీర్ అనే ఆప్షన్ లోకి వెళ్లి..  Recruitment పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: అక్కడ నోటిఫికేషన్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను తెలుసుకోండి.

స్టెప్ 4 : Fill Online Application లో తమ వివరాలను నమోదు చేసి పేమెంట్ ను పూర్తి చేయాలి. తర్వాత దరఖాస్తు ఫారమ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ప్రతీకాత్మక చిత్రం (Image Credit : Sccl Web site)

పూర్తి నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జూనియర్ అసిస్టెంట్‌ ఉద్యోగానికి అప్లై చేయడానికి కంప్యూటర్, ఐటీ ఒక సబ్జెక్ట్‌గా డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు, లేదా సాధారణ డిగ్రీ కలిగి ఉండి... ఆరు నెలల పాటు కంప్యూటర్, ఐటీలో సర్టిఫికేట్ కోర్సులు చేసిన వారు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకునే వారి వయసు 18 ఏళ్లకు పైబడి ఉండాలి. 30 ఏళ్లకు మించి ఉండకూడదు. ఆయా కేటగిరీలకు ప్రత్యేకసడలింపు ఉంటుంది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం మూడు దశల్లో ఉంటుంది.

CBI Internship: ఆ విద్యార్థులకు శుభవార్త.. స్పెషల్ ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తున్న సీబీఐ.. వివరాలివే

ముందుగా రాత పరీక్ష ఉంటుంది. దీనిలో మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు 120 ఉంటాయి. ఇందులో వచ్చిన మార్కలును 100 శాతానికి పర్సంటైల్ చేసి జాబితాను విడుదల చేస్తారు. వీటిలో మెరిట్ లో మార్కులు వచ్చిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొరకు పిలుస్తారు. పరీక్షలో అభ్యర్థులను ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ ఆప్టిట్యూట్‌, జనరల్ స్టడీస్‌, కరెంట్‌ అఫైర్స్, ఇండియ అండ్‌ తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్‌ హెరిటేజ్‌, అర్థమేటిక్‌ అప్టిట్యూడ్‌, లాజికల్‌ రీజనింగ్‌ పై ప్రశ్నలను అడుగుతారు.

First published:

Tags: Career and Courses, JOBS, Singareni Collieries Company

ఉత్తమ కథలు