హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Exam Calendar: డిసెంబర్‌లో ప్రధాన పరీక్షల ఎగ్జామ్ క్యాలెండర్.. నీట్, జేఈఈ, సీయూఈటీ షెడ్యూల్స్ ఎప్పుడంటే..

Exam Calendar: డిసెంబర్‌లో ప్రధాన పరీక్షల ఎగ్జామ్ క్యాలెండర్.. నీట్, జేఈఈ, సీయూఈటీ షెడ్యూల్స్ ఎప్పుడంటే..

Exam Calendar: డిసెంబర్‌లో ప్రధాన పరీక్షల ఎగ్జామ్ క్యాలెండర్.. నీట్, జేఈఈ, సీయూఈటీ షెడ్యూల్స్ ఎప్పుడంటే..

Exam Calendar: డిసెంబర్‌లో ప్రధాన పరీక్షల ఎగ్జామ్ క్యాలెండర్.. నీట్, జేఈఈ, సీయూఈటీ షెడ్యూల్స్ ఎప్పుడంటే..

జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ(JEE), నీట్(NEET), సీయూసీఈటీ(CUCET)లను ప్రతి ఏడాది నిర్వహిస్తుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA). ఈ పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్ క్యాలెండర్-2023ను ఎన్‌టీఏ డిసెంబర్‌లో రిలీజ్ చేయనుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ(JEE), నీట్(NEET), సీయూసీఈటీ(CUCET)లను ప్రతి ఏడాది నిర్వహిస్తుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA). ఈ పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్ క్యాలెండర్-2023ను ఎన్‌టీఏ డిసెంబర్‌లో రిలీజ్ చేయనుంది. అలాగే పరీక్షల తాత్కాలిక తేదీలు, నోటిషికేషన్స్ తేదీలను సైతం విడుదల చేయనుంది. కరోనా కారణంగా గత రెండేళ్లలో పరీక్షలను ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేకపోయారు. ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉండడంతో రెండేళ్లకు ముందున్న షెడ్యూల్ ప్రకారమే వచ్చే ఏడాది నుంచి పరీక్షలు జరగనున్నాయి. ఎన్‌టీఏ నిర్వహించే ఈ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్(Scheduled) వివరాలు చూద్దాం..

నీట్

జాతీయ స్థాయి మెడికల్ ప్రవేశ పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)-2023 నోటిఫికేషన్ వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. నీట్-2023ని మే మొదటి ఆదివారం నిర్వహించనున్నారు. నీట్ నోటిఫికేషన్‌తో పాటు, అప్లికేషన్-కమ్-రిజిస్ట్రేషన్ ఫారమ్‌లు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో విడుదల చేయనున్నారు.

RBI Penalty: ఒకేసారి 9 బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ!

జేఈఈ మెయిన్

దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో అర్హత పరీక్షగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్‌ను నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 నోటిఫికేషన్ నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. నోటిఫికేషన్‌తో పాటు, రిజిస్ట్రేషన్-కమ్-అప్లికేషన్ ఫారమ్స్ ఎన్‌టీఏ వెబ్‌సైట్jeemain.nta.nic.inలో అందుబాటులోకి రానున్నాయి. JEE మెయిన్ 2023 సెషన్-1 పరీక్షలు జనవరిలో, సెషన్-2 పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. రెండో సెషన్‌కు సంబంధించిన దరఖాస్తు ఫారమ్‌లు మార్చిలోగా అందుబాటులోకి రానున్నాయి.

యూజీసీ నెట్

దేశంలోని యూనివర్సిటీలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి అర్హత పరీక్షగా యూజీసీ నెట్‌ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను గతంలో UGC నిర్వహిస్తుండగా, ఇప్పుడు NTA చేపడతుంది. యూజీసీ నెట్ సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు. అయితే కరోనా కారణంగా యూజీసీ నెట్ డిసెంబర్ 2021, జూన్ 2022 పరీక్షలను విలీనం చేసి ఇటీవల నిర్వహించారు. ఇక వచ్చే ఏడాది నెట్ పరీక్షల షెడ్యూల్‌ను NTA త్వరలో విడుదల చేయనుంది.

సీయూఈటీ

సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)ను ఏన్ టీఏ నిర్వహిస్తుంది. సాధారణంగా బోర్డ్ పరీక్షల తర్వాత సీయూఈటీ పరీక్షలు నిర్వహిస్తారు. 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలు 2023 ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమై, మార్చిలో ముగుస్తాయి. దీంతో ఈ తరువాత సీయూఈటీ పరీక్షలు నిర్వహించనున్నారు. సాధారణంగా సీయూఈటీ పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది నిర్వహించిన పరీక్షల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో సెకండ్ టర్మ్ పరీక్ష తేదీలు ఇంకా ప్రకటించలేదని యూజీసీ తెలిపింది.

First published:

Tags: Career and Courses, JOBS

ఉత్తమ కథలు