హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET PG: 2023 నీట్​ పీజీ ప్రవేశాల్లోనూ EWS కోటా వర్తింపు.. విద్యార్థుల పిటిషన్​పై సుప్రీం కోర్డు స్పష్టత..

NEET PG: 2023 నీట్​ పీజీ ప్రవేశాల్లోనూ EWS కోటా వర్తింపు.. విద్యార్థుల పిటిషన్​పై సుప్రీం కోర్డు స్పష్టత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వైద్య విద్యలో పోస్ట్​ గ్రాడ్యుయేషన్​ ప్రవేశాలకు సంబంధించిన నీట్‌- పీజీ కౌన్సెలింగ్‌లో.. ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటా అమలుకు సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపింది.

వైద్య విద్యలో పోస్ట్​ గ్రాడ్యుయేషన్​ ప్రవేశాలకు సంబంధించిన నీట్‌- పీజీ(NEET-PG) కౌన్సెలింగ్‌లో.. ఓబీసీ(OBC), ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటా అమలుకు సుప్రీంకోర్టు(Supreme Court) పచ్చ జెండా ఊపింది. ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ(OBC) రిజర్వేషన్లలో రూ.8 లక్షల రూపాయల క్రిమిలేయర్‌కు సుప్రీంకోర్టు అనుమతించింది. దీంతో గతేడాది మాదిరిగానే 2022–23 ప్రవేశాల్లో కూడా ఈడబ్ల్యూఎస్​ కోటా అమలు చేయనుంది. దీని ప్రకారమే కౌన్సెలింగ్ జరగనుంది. విద్యార్థుల అడ్మిషన్ (Admission)  ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రమాణాలపై తుది నిర్ణయం మాత్రం వచ్చే నెలలో వెల్లడిస్తామని, అప్పటివరకు గతేడాది నిబంధనల ప్రకారమే కౌన్సెలింగ్(Counseling)​ నిర్వహించాలని కోరింది. న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Jobs in Andhra Pradesh: విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్

కాగా, ఈడబ్ల్యూఎస్ కోటా చెల్లుబాటు సంబంధించిన సమస్య సుప్రీం కోర్డు పరిశీలనలో ఉన్నందున, నీట్​ పీజీ 2022–23 ప్రవేశాలకు రూ. 8 లక్షల ఈడబ్ల్యూఎస్​ కోటా వర్తింపుపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ కొంత మంది వైద్య విద్యార్థులు రిట్​ పిటిషన్​ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా, వచ్చే ఏడాది కూడా ఈడబ్ల్యూఎస్​​ కోటాలో రిజర్వేషన్లను వర్తింపజేయాలని, కౌన్సెలింగ్​ ప్రక్రియను నిలిపివేయకూడదని బెంచ్ తెలిపింది. దీనికి సంబంధించి మార్చిలో మరింత స్పష్టతనిస్తామని పేర్కొంది. అయితే, ఈడబ్ల్యూఎస్ నిబంధనలకు సంబంధించి ఆన్‌లైన్ ఫారమ్‌లో ఎడిట్​ ఆప్షన్​ గడువును పొడిగించాలని తన క్లయింట్లు కోరుతున్నట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు.

ఈడబ్ల్యూఎస్​​ కోటాపై మార్చిలో తుది తీర్పు..

దీనికి న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ సమాధానమిస్తూ “లేదు, మేము మీకు ఎడిట్​ విండో పొడిగింపును మంజూరు చేయలేం. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోలేం. అలా చేస్తే ఆర్టికల్ 32 నిబంధనను ఉల్లంఘించినట్లే అవుతుంది. అందువల్ల అధికారులు ఎలా ఏర్పాట్లు చేసి ఉంటే, అలాగే చేయండి. వచ్చే విద్యా సంవత్సరానికి ఈడబ్ల్యూఎస్​ ప్రమాణాలను నిర్ణయించే ప్రక్రియ కొనసాగుతుంది. తుది తీర్పు మార్చిలో వెల్లడిస్తాం. అప్పటివరకు కౌన్సిలింగ్​ ప్రక్రియను ఈడబ్ల్యూఎస్​ కోటాకు అనుగుణంగానే కొనసాగించాలి.’’ అని చెప్పారు.

Blasphemy: పాకిస్థాన్‌లో దారుణం.. దైవదూషణ పేరుతో మానసిక రోగిపై మూకదాడి.. వివరాలిలా..


ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌(EWS Reservation) పొందడానికి రూ. 8 లక్షల ఆదాయ పరిమితి ఇవ్వవచ్చని, తద్వారా ఈ అకడమిక్ సెషన్‌లో ప్రవేశానికి ఎటువంటి సమస్య లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే, ఈ ఆదాయ పరిమితిపై విచారణ కొనసాగిస్తామని తెలిపింది. మార్చి 2022లో ఈ ఆదాయ పరిమితి సరైనదేనా? కాదా? అని కోర్టు చివరకు నిర్ణయిస్తుంది. అప్పటివరకు, నీట్ పీజీ 2023లో 27 శాతం ఓబీసీ, 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా, ఈ పిటిషన్​ను వరుణ్ దిలీప్‌భాయ్ భట్ అనే వైద్య విద్యార్థితో పాటు మరికొందరు విద్యార్థులు దాఖలు చేశారు. విద్యార్థుల తరఫున సీనియర్ న్యాయవాది అరవింద్ దాతర్ వాదనలు వినిపించారు.

First published:

Tags: Career and Courses, EBC Reservation, EDUCATION

ఉత్తమ కథలు