Home /News /jobs /

EVEN IF I GET 99 PERCENT MARKS I WILL WRITE THE EXAM AGAIN IF YOU READ WHAT THE JEE TOPPER SAID LOSE YOUR MIND UMG GH

JEE Main: మా నాయనే .. 99 శాతం మార్కులు వచ్చినా కూడా మళ్ళీ పరీక్ష రాస్తాడంటా.. జేఈఈ టాపర్ చెప్పిన విషయాలు చదివితే మైండ్ పోద్ది !

మా నాయనే .. 99 శాతం మార్కులు వచ్చినా కూడా మళ్ళీ పరీక్ష రాస్తాడంటా.. జేఈఈ టాపర్ చెప్పిన విషయాలు చదివితే మైండ్ పోద్ది !

మా నాయనే .. 99 శాతం మార్కులు వచ్చినా కూడా మళ్ళీ పరీక్ష రాస్తాడంటా.. జేఈఈ టాపర్ చెప్పిన విషయాలు చదివితే మైండ్ పోద్ది !

జేఈఈ(Jee) మెయిన్-2022 సెషన్ 1 పరీక్షలో ముంబైకి చెందిన చిన్మయ్ మూర్జనీ 99.956 పర్సంటైల్ స్కోర్ సాధించాడు. టాప్ స్కోర్ చేసిన వారిలో అతను ఒకడిగా నిలిచాడు. అయితే ఈ స్కోర్‌(Score)తో చిన్మయ్ సంతృప్తి చెందలేదు. మరోసారి జేఈఈ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాడు.

ఇంకా చదవండి ...
జాతీయ స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షలకు పోటీ తీవ్రంగా ఉంటుంది. ఇందులో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) ఒకటి. టాప్ ఇంజనీరింగ్ ఇన్ స్టిట్యూట్‌లలో సీట్ సంపాదించాలంటే జేఈఈ స్కోరే కీలకం. ఇందులో మంచి స్కోర్(Score) సాధించడానికి విద్యార్థులు ఎన్నో ఏళ్ల నుంచి ప్రిపేర్(Prepare) అవుతుంటారు. కొందరు వచ్చిన స్కోర్‌తో సంతృప్తిచెందక మళ్లీ పరీక్ష రాస్తుంటారు. ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్-2022 సెషన్ 1 పరీక్షలో ముంబైకి చెందిన చిన్మయ్ మూర్జనీ 99.956 పర్సంటైల్ స్కోర్ సాధించాడు. టాప్ స్కోర్ చేసిన వారిలో అతను ఒకడిగా నిలిచాడు. అయితే ఈ స్కోర్‌తో చిన్మయ్ సంతృప్తి చెందలేదు. మరోసారి జేఈఈ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాడు.

ఒక ఇంటర్వ్యూలో చిన్మయ్ మాట్లాడుతూ.. ‘నేను జేఈఈ మెయిన్స్ సెకండ్ సెషన్ పరీక్షను కూడా రాస్తున్నాను. నా స్కోర్‌ను మరింత పెంచుకోవడానికి మళ్లీ ఎగ్జామ్ రాస్తున్నాను.’ అని ఈ 17 ఏళ్ల టాపర్ చెప్పుకొచ్చాడు. కాగా, జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ జులై 21న జరుగుతుంది.

2020లో 10వ తరగతి బోర్డు పరీక్షలు రాసిన తరువాత నుంచి చిన్మయ్ జేఈఈ కోసం ప్రిపేర్ మొదలుపెట్టాడు. అతనికి ఇంజనీరింగ్ అంటే అమితమైన ఆసక్తి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా దేశంలోని అగ్రశ్రేణి ఐఐటీల్లో ఒకదాంట్లో సీటు సంపాదించడమే తన లక్ష్యమని చిన్మయ్ తెలిపాడు.

‘జేఈఈ కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో డిటైల్డ్ నోట్స్ తయారు చేసుకున్నాను. దీంతో ఇన్ టైంలో స్టడీ మెటిరియల్‌ను కంప్లీట్ చేశాను. మునుపటి సంవత్సరాల క్వశ్చన్ పేపర్లను ప్రాక్టీస్ చేశాను. అలాగే ప్రతి వారం రెండు మూడు మాక్ టెస్ట్‌లను ప్రయత్నించాను. అంతేకాకుండా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ‘లైవ్ డౌట్ సాల్వింగ్’ తరగతులకు కూడా హాజరయ్యాను’ అని చిన్మయ్ చెప్పాడు.

చిన్మయ్ తండ్రి ఓ ఆర్కిటెక్ట్(architect). తల్లి ఇంటి పనులు చూసుకుంటుంది. అతనికి ఓ చెల్లి కూడా ఉంది. సీబీఎస్‌ఈ బోర్డుతో అనుబంధ సంస్థ ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పదోతరగతి చదివాడు. పదిలో 98శాతం మార్కులు సాధించాడు. ప్రస్తుతం12వ తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు.

చిన్మయ్ మాత్రమే కాకుండా చాలా మంది జేఈఈ మెయిన్ సెషన్ 1 టాపర్లు కూడా సెషన్ -2 పరీక్షలు రాయనున్నారు. మొదటి సెషన్‌లో 100 పర్సంటైల్ స్కోర్ సాధించిన రాజస్థాన్‌కు చెందిన నవ్య హిసారియా రెండో సెషన్‌కు కూడా హాజరుకావాలని భావిస్తోంది. ప్రాక్టీస్‌ను మెరుగుపర్చుకోవడానికి, టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్‌ను పెంపొందించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది. కాగా, రెండో టర్మ్‌లో ఒకవేళ తక్కువ స్కోర్ చేస్తే, నిబంధనల ప్రకారం రెండు టర్మ్‌ల్లో ఎక్కువ స్కోర్‌ సాధించిన దాన్నే తుది ఫలితంగా లెక్కిస్తారు.
Published by:Mahesh
First published:

Tags: CBSE, Jee main 2022, JOBS, Score card

తదుపరి వార్తలు