Andhra Pradesh: కరోనాను ఎదుర్కొనేందుకు వారికి ఉచిత శిక్షణ.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..

నర్సుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ), జనరేషన్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

news18-telugu
Updated: November 5, 2020, 10:28 AM IST
Andhra Pradesh: కరోనాను ఎదుర్కొనేందుకు వారికి ఉచిత శిక్షణ.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈ కరోనా కాలంలో ప్రజల ప్రాణాలు కాపాడడానికి ముందు వరుసలో నిలిచిన వారిలో నర్సులు ఒకరు. తామకు వైరస్ ముప్పు ఉంటుందని తెలిసి కూడా అనేక మంది వారి ప్రాణాలకు తెగించి కరోనా బాధితులతో పాటు, ఇతర రోగులకు సేవలందించారు. అయితే ఈ నేపథ్యంలో నర్సుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ), జనరేషన్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆసక్తి కలిగిన నర్సులు http://apssdc.in వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్ లైన్ ద్వారా శిక్షణ పొందవచ్చు.

ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా..

-మొదట http://apssdc.in ఓపెన్ చేయాలి
-అనంతరం Announcementsపై క్లిక్ చేయాలి
-Registration for ‘Nurses Upadating’పై క్లిక్ చేయాలి
-అయితే ఈ కోర్సును 21 రోజుల లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
అర్హత..

-ANM/GNM, B.Sc నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు
-లేదా కరోనా ఆస్పత్రి చికిత్స అందించే ఆస్పత్రిలో పని చేసే వారై ఉండాలి.



ప్రయోజనాలు..
ఈ శిక్షణ మొత్తం ఆన్ లైన్ లోనే ఉంటుంది. శిక్షణ పూర్తి చేసిన వారికి Trained Nurses Association of India(TNAI) వారిచే అప్రూవ్ చేసిన సర్టిఫికేట్ ఇవ్వనున్నారు.
-ఈ శిక్షణ ద్వారా కరోనా నుంచి తమకు తాము రక్షించుకునే విషయంపై అవగాహన పెరుగుతుంది.
- శిక్షణ ద్వారా.. కరోనా రోగులకు చికిత్స చేసే సమయంలో ఒత్తిడి లేకుండా పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది.
ఏమైనా సందేహాలు ఉంటే 18004252422 నంబరుకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
Published by: Nikhil Kumar S
First published: November 5, 2020, 10:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading