ESIC SSO ADMIT CARD 2022 RELEASED AT ESIC NIC IN EXAM ON JUNE 11 KNOW FULL DETAILS HERE GH VB
Admit Cards Dowload: గుడ్ న్యూస్.. ఆ ఎగ్జామ్ అడ్మిట్ కార్టు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
(ప్రతీకాత్మక చిత్రం)
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC).. ఇటీవల సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ (SSO-2022) ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌ను జారీ చేసింది. దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ ఆధ్వర్యంలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC).. ఇటీవల సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ (SSO-2022) ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌ను జారీ చేసింది. దీంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవాలని ESIC విజ్ఞప్తి చేసింది.అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోడం కోసం ESIC అధికారిక వెబ్సైట్ esic.nic.inలో లింక్ అందుబాటులో ఉంది.
స్టెప్-2: రిక్రూట్మెంట్లో SSO పోస్ట్ కోసం కాల్ లెటర్ ఫేజ్‌లో - I స్టెప్ పరీక్షల కోసం ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి
స్టెప్-3: IBPS పోర్టల్‌లో లాగిన్ అవ్వడం కోసం అభ్యర్థి రిజిస్ట్రేషన్/రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి.
స్టెప్-4: ESIC SSO పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
స్టెప్-5: అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసి ఫ్రింటౌట్ తీసుకోండి
జూన్ 11 వరకు అభ్యర్థులు తమ అడ్మి్ట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడానికి ESIC అవకాశం కల్పించింది. అయితే అడ్మిట్ కార్డు లేని అభ్యర్థులను ఎట్టిపరిస్థితుల్లో పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
* SSO పరీక్ష విధానం
పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉండనున్నాయి. పరీక్ష రాయడానికి అభ్యర్థులకు గంట సమయం కేటాయించనున్నారు. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి, ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులలో 1/4 వంతు తీసివేస్తారు.
ఈ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. రిక్రూట్మెంట్కు సంబంధించి అన్ని దశలను క్లియర్ చేసిన అభ్యర్థులు ఉద్యోగానికి షార్ట్‌లిస్ట్ కానున్నారు. కాగా, ఈ ఏడాది రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తంగా 93 SSO ఖాళీలను భర్తీ చేయనున్నారు. SSO ఫేజ్ I ప్రిలిమినరీ పరీక్ష జూన్ 11న జరగనుంది.
మరోవైపు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా సెలక్షన్ పోస్ట్ ఫేజ్ X- 2022 కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ మే 12 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 13గా నిర్ణయించింది. అలాగే దరఖాస్తు ఫారంలోని తప్పులను సవరించడం కోసం జూన్ 20 నుంచి జూన్ 24 వరకు సమయం కేటాయించింది. ఈ పరీక్ష ఆగస్టులో, కంప్యూటర్ మోడ్‌లో జరగనుంది. అయితే అధికారికంగా పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 2065 ఖాళీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేయనుంది. మరిన్ని వివరాలకు ssc.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కోరింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.