ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Employees' State Insurance Corporation) మెడికల్ కాలేజీలో పలు పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా ఈఎస్ఐసీలో 1120 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ (Insurance Medical Officer) గ్రేడ్ - 2 (అల్లోపతి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష , ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అప్లై చేయానుకొన్న అభ్యర్థులకు గరిష్ఠ వయసు 35 ఏళ్లు మించకూడదు. అప్లికేషన్ ప్రాసెస్, నోటిఫికేషన్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.esic.nic.in/recruitments ను చూడాలి. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 జీతం అందిస్తారు. దరఖాస్తుకు డిసెంబర్ 31, 2021 వరకు అవకాశం ఉంది.
దరఖాస్తు చేసుకొనే వారు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్న్‌షిప్ పూర్తి చేయని అభ్యర్థులు రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.
1,120
పరీక్ష విధానం..
అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ అబ్జెక్టీవ్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 200 మార్కులు ఉంటాయి. రెండు సెక్షన్‌లు ఉంటాయి. సెక్షన్-1లో 100 మార్కులు, సెక్షన్-2లో 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు ఉంటుంది.
విభాగం
సబ్జెక్టు
ప్రశ్నలు
మార్కులు
సెక్షన్-
జనరల్ మెడిసిన్ అండ్ పీడియాట్రిక్స్
80+20 ప్రశ్నలు
100
సెక్షన్-
సర్జరీ, గైనకాలజీ అండ్ అబ్‌స్టెట్రిక్స్ ప్రివెంటీవ్ అండ్ సోషల్ మెడిసిన్
Step 5: దరఖాస్తు పూర్తయిన అనంతరం రూ.500 పరీక్ష ఫీజు చెల్లించాలి.
Step 6: అప్లికేషన్ పూర్తయిన తరువాత సబ్‌మిట్ (Submit) చేయాలి.
Step 7: దరఖాస్తు ఫాం ఒక కాపీని ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
Step 8: దరఖాస్తుకు డిసెంబర్ 31, 2021 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.