Home /News /jobs /

ESIC RECRUITMENT 2022 334 JOBS IN HYDERABAD SANATH NAGAR FOUR DAYS CHANCE FOR APPLICATION EVK

ESIC Recruitment 2022: హైద‌రాబాద్ స‌న‌త్‌న‌గ‌ర్‌లో 334 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు నాలుగు రోజులే చాన్స్‌

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ESIC Recruitment | హైద‌రాబాద్ స‌న‌త్ న‌గ‌ర్‌లోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ మ‌రో 4 రోజుల్లో పూర్త‌వుతుంది.

    ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (Employees' State Insurance Corporation) లో ప‌లు రీజియ‌న్‌లలో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ (Notification) విడుదల అయ్యాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది.  తెలంగాణ‌లో హైద‌రాబాద్ స‌న‌త్‌న‌గ‌ర్‌ రీజియ‌న్‌కు సంబంధించి ఫ్యాక‌ల్టీ, సూప‌ర్ స్పెష‌లిస్టులు, జూ.క‌న్స‌ల్టెంట్ త‌దిత‌ర‌ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి సంబంధిత విభాగాల్లో అనుభ‌వం ఉండాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ద‌ర‌ఖాస్తులు ఏప్రిల్ 3, 2022న ప్రారంభ‌మై ఏప్రిల్ 14, 2022న ముగుస్తుంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.60,000 నుంచి రూ. 2,80,000 వ‌ర‌కు వేత‌నం అందిస్తారు. నోటఫికేష‌న్ వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.esic.nic.in/recruitments ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

    RRB Group D Preparation: ఆర్ఆర్‌బీ గ్రూప్‌-డికి ఒక్క‌టే ప‌రీక్ష‌.. ప్రిప‌రేష‌న్, సిల‌బ‌స్ వివ‌రాలు..

    పోస్టుల వివరాలు..



















































    పోస్టుఖాళీలు
    ఫ్యాకల్టీ పోస్టులు77
    సూపర్ స్పెషలిస్టులు11
    జూనియర్ కన్సల్టెంట్లు20
    స్పెషాలిటీ స్పెషలిస్టులు05
    సీనియర్ రెసిడెంట్లు05
    రిసెర్చ్ సైంటిస్టులు02
    కన్సల్టెంట్లు06
    సీనియర్ రెసిడెంట్లు97
    సీనియర్ రెసిడెంట్లు (బ్రాడ్ స్పెష‌లిస్ట్‌లు)28
    జూనియ‌ర్ రెసిడెంట్లు23
    జూనియ‌ర్ రెసిడెంట్లు (బ్రాడ్ స్పెష‌లిస్ట్‌లు)37

    ఎంపిక విధానం..

    Step 1: ముంద‌గా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.

    Jobs in Telangana: కేంద్రీయ విద్యాల‌యంలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం రూ.27,500

     Step 2: పోస్టుల‌ను అనుస‌రించి ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ, సంబంధిత స్పెష‌లైజేష‌న్ ఉన్న స‌ర్టిఫికెట్లు ప‌రిశీలిస్తారు.



    Step 3: ప‌ని అనుభ‌వం.. మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.

    Step 4: షార్ట్ లిస్ట‌యిన అభ్య‌ర్థుల‌కు పోస్టింగ్ ఇస్తారు.

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1: ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో జ‌రుగుతుంది.

    Step 2: ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.esic.nic.in/recruitments ను సంద‌ర్శించాలి.

    Step 3: అనంత‌రం నోటిఫికేష‌న్ పూర్తిగా చ‌ద‌వాలి.

    Job News: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. జాబ్ న్యూస్ కోసం టెలిగ్రామ్ చాన‌ల్ ప్రారంభించ‌నున్న‌ ప్ర‌భుత్వం!

    Step 4: అర్హ‌త‌లు ఉన్న‌వారు అనంత‌రం అప్లై ఆన్‌లైన్‌లోకి వెళ్లి ద‌ర‌ఖాస్తుకు అవ‌స‌ర‌మైన స‌మాచారం అందించాలి.

    Step 5: ద‌ర‌ఖాస్తు పూర్త‌యిన అనంతరం రూ.500 ప‌రీక్ష ఫీజు చెల్లించాలి.

    Step 6: అప్లికేష‌న్ పూర్త‌యిన త‌రువాత స‌బ్‌మిట్ (Submit) చేయాలి.

    Step 7: ద‌ర‌ఖాస్తు ఫాం ఒక కాపీని ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.

    Step 8: ద‌ర‌ఖాస్తులు ఏప్రిల్ 4, 2022న ప్రారంభం అవుతాయి.

    Step 9: ద‌ర‌ఖాస్తుకు ఏప్రిల్ 14, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Central Government Jobs, ESIC, Govt Jobs 2022, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు