Home /News /jobs /

ESIC RECRUITMENT 2022 218 POSTS IN ESIC DELHI KNOW QUALIFICATIONS AND APPLICATION PROCESS EVK

ESIC Recruitment 2022: ఈఎస్ఐసీలో 218 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ESIC Recruitment 2022 | నిరుద్యోగుల ఎంప్లాయీస్ స్టేట్ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఖాళీల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఢిల్లీ ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న డెంట‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్‌, మెడిక‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్‌ల‌లో ఉద్యోగాల‌ను ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    నిరుద్యోగుల ఎంప్లాయీస్ స్టేట్ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఖాళీల భర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఢిల్లీ ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న డెంట‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్‌, మెడిక‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్‌ల‌లో ఉద్యోగాల‌ను ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. టీచింగ్ ఫ్యాక‌ల్టీ, అసోసియేట్ ప్రొఫెస‌ర్ విభాగాల్లో భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు 50 ఏళ్లు మించి ఉండ కూడ‌దు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు వేత‌నం రూ.39,100లతోపాటు అద‌నంగా అల‌వెన్స్‌లు ఇస్తారు. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.esic.nic.in/recruitments ను సంద‌ర్శించాలి. ద‌ర‌ఖాస్తుకు మే 11, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    పోస్టుల వివరాలు..















    విభాగంఖాళీలు
    మెడిక‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్‌103
    డెంట‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్‌115

    అర్హ‌త‌లు..
    సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేష‌న్‌, ఎండీ చేసి ఉండాలి. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి. గరిష్ట వ‌య‌సు 50 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు.

    Jobs in Telangana: సింగ‌రేణి కొల‌రీస్‌లో ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండా నేరుగా ఇంట‌ర్వ్యూలు



    ఎంపిక విధానం..
    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
    - అనంత‌రం ఎంపిక చేసిన వారికి ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు.
    - మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

    Jobs in Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంట్రాక్టు ఉద్యోగాలు.. నెల‌కు రూ. 53,500 వేత‌నం.. ద‌ర‌ఖాస్తు విధానం

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆఫ్‌లైన్‌లో ఉంటుంది.

    Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.esic.nic.in/recruitments ను సంద‌ర్శించాలి.

    Step 3 - నోటిఫికేష‌న్‌ డౌన్‌లోడ్ చేసుకొని పూర్తిగా చ‌దవాలి.

    Jobs in Hyderabad: కేంద్ర సంస్థ‌లో కాంట్రాక్టు జాబ్స్‌.. ప‌రీక్ష లేకుండా నేరుగా వాక్ ఇన్ వివ‌రాలు ఇవే

    Step 4 - నోటిఫికేష‌న్ చివ‌ర‌న అప్లికేష‌న్ ఫాంన్ ప్రింట్ తీసుకొని త‌ప్పులు లేకుండా నింపాలి.

    Step 5 - అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు జ‌త చేసి

    మెడిక‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్ ద‌ర‌ఖాస్తుల‌ను
    THE Regional Director ESI Corporation, Panchdeep Bhawan,
    Sector-16, N.I.T., Faridabad-121002, Haryana.

    డెంట‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్ ద‌ర‌ఖాస్తుల‌ను
    The Regional Director, ESI Corporation, DDA Complex Cum Office, 3rd and 4th Floor Rajendra Place, Rajendra Bhawan, New Delhi-110008 అడ్ర‌స్‌ల‌కు పంపాలి.

    Step 6 - ద‌రఖాస్తుకు మే 11, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Central Government Jobs, ESIC, Govt Jobs 2022, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు