హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

ESIC Recruitment 2021: ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక

ESIC Recruitment 2021: ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ మరియు సీనియర్ రెసిడెంట్స్ ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థులు మూడు నెలల పాటు కరోనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వారి బయోడేటాను faridabad@esic.nic.inకు పంపించాలని నోటిఫికేషన్లో సూచించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ప్రతీ సోమ, బుధ, శుక్రవారాల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో సూచించారు. ఇంటర్వ్యూల ప్రక్రియ మే 19న ప్రారంభం కాగా.. ఖాళీల భర్తీ పూర్తయ్యే వరకు కొనసాగుతాయని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. మొత్తం 50 ఖాళీల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు.

NTPC Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..

Free Online Training: విద్యార్థులు, నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ కోర్సులకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

అర్హతల వివరాలు..

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు MB/MS/DBN తో పాటు మెడిసిన్, అనస్థేషియా, క్రిటికల్ కేర్, ఫ్యామిలీ మెడిసిన్ తదితర కోర్సుల్లో డిప్లమో చేసి చేసి ఉండాలి. ఇతర అర్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

వయో పరిమితి..

-స్పెషలిస్ట్ డాక్టర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 55 ఏళ్లకు మించకూడదు.

-సీనియర్ రెసిడెంట్ అభ్యర్థులకు 45 ఏళ్లు మించకూడదు.

Official Website - Direct Link

ఇంటర్వ్యూలు Conference Hall, Academic Block at Esic Medical College and Hospital, Faridabad చిరునామాలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా సెలక్షన్ కమిటీ ఎంపిక నిర్వహిస్తుంది.

First published:

Tags: ESIC, Government jobs, Health jobs, Job notification, JOBS

ఉత్తమ కథలు