ESIC Recruitment 2020: ఈఎస్ఐలో ఉద్యోగాలు... రేపే ఇంటర్వ్యూలు

ESIC Recruitment 2020 | ఈఎస్ఐ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గుల్బర్గాలోని ఆస్పత్రిలో పలు పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

news18-telugu
Updated: October 22, 2020, 9:03 AM IST
ESIC Recruitment 2020: ఈఎస్ఐలో ఉద్యోగాలు... రేపే ఇంటర్వ్యూలు
ESIC Recruitment 2020: ఈఎస్ఐలో ఉద్యోగాలు... రేపే ఇంటర్వ్యూలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ హాస్పిటల్ గుల్బర్గా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వేర్వేరు విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 39 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు అక్టోబర్ 23న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ముందుగా ఈఎస్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఎంసీఐ నియమనిబంధనల ప్రకారం విద్యార్హతలు, ఇతర అర్హతలు ఉన్నవాళ్లే ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీస్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లాలి. మరిన్ని వివరాలు https://www.esic.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

ECIL Recruitment 2020: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

IIT Hyderabad Recruitment 2020: హైదరాబాద్ ఐఐటీలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

ESIC Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 39

అసోసియేట్ ప్రొఫెసర్- 12
ఫోరెన్సిక్ మెడిసిన్- 01ప్యాథాలజీ- 02
జనరల్ మెడిసిన్- 03
డెర్మటాలజీ- 01
సైకియాట్రి- 01
జనరల్ సర్జరీ- 01
ఆర్థోపెడిక్స్- 01
రేడియాలజీ- 02

అసిస్టెంట్ ప్రొఫెసర్- 27
ఫిజియాలజీ- 01
కమ్యూనిటీ మెడిసిన్- 03
బయోకెమిస్ట్రీ- 01
మైక్రోబయాలజీ- 01
ప్యాథాలజీ- 01
జనరల్ మెడిసిన్- 02
డెర్మటాలజీ- 01
సైకియాట్రీ- 01
పీడియాట్రిక్స్- 01
జనరల్ సర్జరీ- 04
ఆర్థోపెడిక్స్- 01
ఆప్తమాలజీ- 01
ఓబీజీ- 02
అనస్థీసియాలజీ- 04
రేడియాలజీ- 02
బ్లడ్ బ్యాంక్ (హెమటాలజీ)- 01

BEL Recruitment 2020: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 78 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు

Jobs: మొత్తం 550 ఉద్యోగాల భర్తీకి ఎన్ఎల్‌సీ ఇండియా నోటిఫికేషన్... నేటి నుంచి దరఖాస్తులు

ESIC Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


వాక్ ఇన్ ఇంటర్వ్యూ- 2020 అక్టోబర్ 23
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
వయస్సు- అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు గరిష్టంగా 69 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని కేటగిరీలకు వయస్సులో సడలింపు ఉంటుంది.
వేతనం-నెలకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.92,000, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,06,000
దరఖాస్తు విధానం- అభ్యర్థులు అక్టోబర్ 23న నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. రిజిస్ట్రేషన్స్ ఉదయం 9 గంటలకు మొదలై 11 గంటలకు ముగుస్తాయి.
Published by: Santhosh Kumar S
First published: October 22, 2020, 9:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading