Jobs In ESIC: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(Employee State Insurance Corporation) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ గ్రేడ్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీని కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. హైదరాబాద్, చెన్నైలకు ఈ రిక్రూట్మెంట్(Recruitment) జరగనుంది. ఈ ఖాళీ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే.. ఆఫ్ లైన్(Offline) విధానంలో చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్లో అప్లికేషన్ పూరించి.. క్రింద ఇవ్వబడిన చిరునామాకు పంపాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులుడిసెంబర్ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ప్రకారం.. ESICలో కార్డియాలజీ, కార్డియో-థొరాసిక్, ఎండోక్రినాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, క్యాన్సర్ సర్జరీ, యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, థొరాసిక్ సర్జరీ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి సంబంధిత స్పెషాలిటీలో MBBS అలాగే DM, MCh, PG లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి
ఈ నోటిఫికేషన్ లోని పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 27 డిసెంబర్ 2022 నాటికి 45 ఏళ్లు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.
జీతం
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ.78,800గా చెల్లించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
దరఖాస్తు ఫీజు..
జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.500 డిమాండ్ డ్రాఫ్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/మాజీ-సర్వీస్మెన్/మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
ఈ చిరునామాలకు దరఖాస్తులను పంపండి..
హైదరాబాద్ చిరునామా- ప్రాంతీయ డైరెక్టర్, ESI కార్పొరేషన్, పంచదీప్ భవన్, 5-9-23, హిల్ ఫోర్ట్ రోడ్, ఆదర్శ్ నగర్, హైదరాబాద్- 500063 తెలంగాణ .
తమిళనాడు చిరునామా- ప్రాంతీయ డైరెక్టర్, ESI కార్పొరేషన్, పంచదీప్ భవన్, 143, స్టెర్లింగ్ రోడ్, చెన్నై-600034 తమిళనాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.