Home /News /jobs /

ESIC HYDERABAD RECRUITMENT 2020 NOTIFICATION RELEASED FOR 120 POSTS SS

ESI Hyderabad Jobs: హైదరాబాద్‌లోని ఈఎస్ఐలో 120 జాబ్స్... ఖాళీల వివరాలివే

ESI Hyderabad Jobs: హైదరాబాద్‌లోని ఈఎస్ఐలో 120 జాబ్స్... ఖాళీల వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

ESI Hyderabad Jobs: హైదరాబాద్‌లోని ఈఎస్ఐలో 120 జాబ్స్... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

ESIC Hyderabad Recruitment 2020 | నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC 120 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలివే.

    హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 120 ఖాళీలను ప్రకటించింది. సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషలిస్ట్, ట్యూటర్, జూనియర్ రెసిడెంట్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 7 చివరి తేదీ. ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఇంటర్వ్యూలు ఉంటాయి. ఏఏ పోస్టుకు ఏ తేదీల్లో ఇంటర్వ్యూలు ఉంటాయో పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.esic.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 26,778 ఉద్యోగాలు... వారం రోజుల్లోనే భర్తీ

    ONGC Jobs: ఓఎన్‌జీసీలో 4182 ఉద్యోగాలు... కాకినాడ, రాజమండ్రిలో ఖాళీలు

    ESIC Hyderabad Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 120
    ఫ్యాకల్టీ- 39
    సూపర్ స్పెషలిస్ట్- 03
    సీనియర్ రెసిడెంట్- 47
    జూనియర్ రెసిడెంట్ / ట్యూటర్- 31

    Jobs: అనంతపురం జిల్లాలో 1851 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    SBI Jobs: ఎస్‌బీఐలో 3850 జాబ్స్... అప్లికేషన్ ప్రాసెస్ ఇదే

    ESIC Hyderabad Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 25
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 7
    ఇంటర్వ్యూలు- ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 11
    విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి
    వేతనం- రూ.60,000 నుంచి రూ.1,77,000
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు