Jobs In ESIC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈఎస్‌ఐసీ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే..

(ప్రతీకాత్మక చిత్రం)

Jobs In ESIC: నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ). తాజాగా 47 స్పెషలిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ గ్రేడ్ 2 (Seniar Scale & Junior Scale) పోస్టులను భర్తీ చేయనుంది.

  • Share this:
నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ). తాజాగా 47 స్పెషలిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ గ్రేడ్ 2 (Seniar Scale & Junior Scale) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://www.esic.nic.in/recruitments లో ఉన్న దరఖాస్తు ఫారాలను పొందవచ్చు. అభ్యర్థులు స్పీడ్ పోస్ట్(Speed Post) ద్వారా దరఖాస్తు ఫారమ్‌లను (Application Froms) సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు నవంబర్ 1 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Indian Railway Jobs: పది పాసైన అభ్యర్థులకు రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..


అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, లడఖ్, లాహౌల్, హిమాచల్ ప్రదేశ్, అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లోని చంబా జిల్లాలో నివసిస్తున్న అభ్యర్థులకు నవంబర్ 8 వరకు దరఖాస్తు పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు. మొత్తం ఖాళీల సంఖ్యలో 2 పోస్టులు స్పెషలిస్ట్ గ్రేడ్ 2 (సీనియర్ స్కేల్).. మిగిలినవి స్పెషలిస్ట్ గ్రేడ్ 2 (జూనియర్ స్కేల్) లో ఉన్నాయి. సెలక్షన్ బోర్డు నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది.

AICTE Saksham Scholarship: ఆ విద్యార్థులకు ఏఐసీటీఈ సాక్షం స్కాలర్‌షిప్.. ఎంపికైతే ఏటా రూ.50 వేలు స్టైఫండ్..


ఈ పోస్టులకు ఇంటర్వ్యూ ప్రక్రియ రాష్ట్ర రాజధానిలో వంటి అందరికీ అనువైన ప్రదేశంలో జరుగుతుంది. ఇంటర్వ్యూల షెడ్యూల్ సమయంలో లొకేషన్ తెలియజేస్తుంది. అయితే, దరఖాస్తు చేసుకున్న రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రంలో ఇంటర్వ్యూలు నిర్వహించే హక్కు కార్పొరేషన్‌కు ఉందని ఈఎస్‌ఐ కార్పొరేషన్ జాబ్ నోటీసులో పేర్కొంది.

అర్హత..
ఈఎస్‌ఐసీ ప్రకారం ఆసక్తి గల అభ్యర్థులు స్థానిక భాషలో మాట్లాడగలిగి ఉండాలి. అభ్యర్థులకు తమిళనాడు రాష్ట్రంలో ఉద్యోగం వస్తే వారు తమిళ్ మాట్లాడగలగాలి. లేదా ఒక రాష్ట్ర అధికారిక భాష లో మిడిల్ లెవెల్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. సీనియర్ స్కేల్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు నవంబర్ 1 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.

NIT Warangal: రూ.500తో ఆన్ లైన్ కోర్సు.. అర్హత, దరఖాస్తు చేసుకునే వివరాలు ఇలా..


ఇనీషల్ పే రూ.78,800. గుర్తింపు పొందిన మెడికల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. జాబ్ నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత స్పెషాలిటీ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి.

జూనియర్ స్కేల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నవంబర్ 1 నాటికి 40 సంవత్సరాలు దాటకూడదు. వీరికి ఇనీషియల్ పే రూ.69,700 అందుతుంది. వీరు తప్పనిసరిగా లాంగ్వేజ్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో లోకల్ లాంగ్వేజ్ తెలిసిన ఉద్యోగాలు పొందొచ్చు. అదనపు సమాచారం కోసం అభ్యర్థులు జాబ్ నోటిఫికేషన్‌ చూడవచ్చు.

అప్లికేషన్ ఫారం, జాబ్ డీటెయిల్స్ కోసం
https://www.esic.nic.in/attachments/recruitmentfile/7e0a4ed3e8b908ba2aa1f37c24acc507.pdf లింక్ ను విజిట్ చేయండి.
Published by:Veera Babu
First published: