Home /News /jobs /

EPFO RECRUITMENT 2022 GOVT JOBS CAN BE GET ON THESE POSTS WITHOUT EXAM IN THE MINISTRY OF LABOR AND EMPLOYMENT APPLY PROCESS KNOW HERE VB

EPFO Jobs: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)లో ఉద్యోగాలు.. హైదరాబాద్ లో పోస్టింగ్..

EPFO Jobs: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)లో ఉద్యోగాలు.. హైదరాబాద్ లో పోస్టింగ్..

EPFO Jobs: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)లో ఉద్యోగాలు.. హైదరాబాద్ లో పోస్టింగ్..

EPFO Jobs: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లోని వివిధ కార్యాలయాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు EPFO ​​అధికారిక వెబ్‌సైట్ epfindia.gov.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. డిప్యూటేషన్ ప్రాతిపదికన సంస్థకు చెందిన వివిధ కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి అర్హులనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ విజిలెన్స్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మొదలైంది.

అభ్యర్థులు అధికారిక సైట్ epfindia.gov.in ను సందర్శించడం ద్వారా ఈ పోస్టుల కోసం దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. చివరి తేదీ 24 సెప్టెంబర్ 2022గా నిర్ణయించబడింది.

BEL Recruitment 2022: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెట్ లో ఉద్యోగాలు.. జీతం రూ.1.20 లక్షలు..


నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఢిల్లీ మెయిన్ ఆఫీస్, నార్త్ జోన్ ఢిల్లీ, వెస్ట్ జోన్ ముంబాయి, సౌత్ జోన్ హైదరాబాద్, ఈస్ట్ జోన్ కోలకత్తాలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

అసిస్టెంట్ డైరెక్టర్ (విజిలెన్స్ ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత అర్హతను కలిగి ఉండాలి. అర్హత వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం.. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 56 ఏళ్లు మించకూడదు. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు.

TSLPRB Constable Hall tickets: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్స్ విడుదలపై అప్ డేట్..


జీతం
ఈ రిక్రూట్‌మెంట్ కింద ఎంపికైన అభ్యర్థులు లెవల్-10 పే-మ్యాట్రిక్స్ ప్రకారం జీతం పొందుతారు. పే మ్యాట్రిక్స్‌లోని లెవల్-10 (పే బ్యాండ్-3 రూ. 15600-39100 గ్రేడ్ పే రూ. 5400 తో ఉంటుంది.

ఆఫ్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి..?
వివరాలను నింపిన అప్లికేషన్ ఫారమ్ ను EPFO, ప్రధాన కార్యాలయం, శ్రీ మోహిత్ కుమార్ శేఖర్, రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్ (HRM), భవిష్య నిధి భవన్, 14 భికాజీ కామా ప్లేస్, న్యూఢిల్లీ 110066కి పంపించాలి. దరఖాస్తుతో పాటు.. అర్హత కలిగిన సర్టిఫికేట్ల జిరాక్స్ లను పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇతర వివరాలను అధికారిక వెబ్ సైట్ సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, EPFO, JOBS, Pf balance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు