EPFO: డిగ్రీ పాసైనవారికి ఈపీఎఫ్ఓలో 2,189 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

EPFO: డిగ్రీ పాసైనవారికి ఈపీఎఫ్ఓలో 2,189 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)

EPFO Recruitment 2019 | ప్రిలిమ్స్, మెయిన్స్‌లో పాసైనవారికి కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించే అవకాశముంది.

  • Share this:
    నిరుద్యోగులకు శుభవార్త. డిగ్రీ పాసైనవారికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO సంస్థలో 2,189 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులున్నాయి. తెలంగాణలో 151, ఆంధ్రప్రదేశ్‌లో 60 ఖాళీలున్నాయి. డిగ్రీ పాసైన వారి నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది ఈపీఎఫ్ఓ. డిగ్రీతో పాటు డేటా ఎంట్రీ వర్క్ తెలిసి ఉండాలి. వయస్సు 18 నుంచి 27 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్లే అర్హులు. దరఖాస్తు చేయడానికి జూలై 21 చివరి తేదీ. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో పాసైనవారికి కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించే అవకాశముంది. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈపీఎఫ్ఓ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    EPFO recruitment 2019: సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయండి ఇలా


    ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ www.epfindia.gov.in ఓపెన్ చేయండి.
    Miscellaneous సెక్షన్‌లో Recruitments పైన క్లిక్ చేయండి.
    Recruitment to the post of Social Security Assistant in EPFO లింక్ కనిపిస్తుంది.
    నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత Apply Online పైన క్లిక్ చేయండి.
    'Click here for Registration' పైన క్లిక్ చేసి పేరు, ఇమెయిల్ ఐడీ, ఇతర వివరాలు ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
    ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ జనరేట్ అవుతుంది.
    మీ వివరాలు సరిచూసుకొని దరఖాస్తు సేవ్ చేసుకోవాలి.
    ఫోటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి.
    Final Submit పైన క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ చేయాలి.
    చివరగా 'Submit' పైన క్లిక్ చేస్తే మీ దరఖాస్తు సబ్మిట్ అవుతుంది.

    EPFO recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం: 2019 జూన్ 27
    దరఖాస్తు ముగింపు: 2019 జూలై 21 సాయంత్రం 5 గంటలు
    ఆన్‌లైన్ ఎగ్జామ్: ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1
    దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు రూ.250, ఇతరులకు రూ.500
    దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 2019 ఆగస్ట్ 5
    అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, డేటా ఎంట్రీ వర్క్ తెలిసుండాలి.
    వయస్సు: 18 నుంచి 27 ఏళ్లు

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి...



    ఇవి కూడా చదవండి:

    Bank Jobs: సౌత్ ఇండియన్ బ్యాంకులో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా

    Jobs: మజగాన్ డాక్ లిమిటెడ్‌లో 445 ఉద్యోగాలు

    Jobs: ఎయిర్‌లైన్ అల్లైడ్ సర్వీసెస్‌లో సూపర్‌వైజర్ ఉద్యోగాలు
    First published: