హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Entrepreneurship Courses: ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సులను అందించనున్న DSE యూనివర్సిటీ.. SIDBIతో ఒప్పందం

Entrepreneurship Courses: ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సులను అందించనున్న DSE యూనివర్సిటీ.. SIDBIతో ఒప్పందం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యూనివర్సిటీ (DSEU).. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI)తో ఒప్పందం చేసుకుంది. నైపుణ్యాలు ఉన్న యువతకు ఎంటర్‌ప్రెన్యూరియల్ ఎడ్యుకేషన్ అందించడం ఈ ఒప్పందం లక్ష్యం.

ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యూనివర్సిటీ (DSEU).. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI)తో ఒప్పందం చేసుకుంది. నైపుణ్యాలు ఉన్న యువతకు ఎంటర్‌ప్రెన్యూరియల్ ఎడ్యుకేషన్ (entrepreneurial education) అందించడం ద్వారా "మిషన్ స్వావలంబన్"ను విస్తరించడంతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎడ్యుకేషన్‌కు ప్రోత్సాహాన్ని అందించడానికి ఈ ఒప్పందం తోడ్పడుతుందని రెండు సంస్థలు ప్రకటించాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎంటర్‌ప్రైజ్‌ను యువతకు కెరీర్ ఆప్షన్‌గా ప్రోత్సహించడానికి SIDBI, DSEU సంస్థలు అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేశాయి.

DSEU క్యూరేటెడ్ కోర్సులను అభివృద్ధి చేస్తుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి తెలుసుకునేలా ఔత్సాహికులకు సహాయం చేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి SIDBI భాగస్వామ్యంతో కార్యక్రమాలను ప్రారంభిస్తుంది. సొంతంగా మైక్రో ఎంటర్‌ప్రైజ్‌లను సైతం ప్రారంభిస్తుంది. మే 31న ఢిల్లీలోని డీఎస్‌ఈయూ క్యాంపస్‌లో సంబంధిత విభాగాలకు చెందిన ప్రతినిధులు ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు.

ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రమోషన్, క్రెడిట్ కనెక్షన్, ఎంటర్‌ప్రైజ్ ఎకోసిస్టమ్‌ వంటి వాటిపై SIDBI దృష్టి సారిస్తుంది. అయితే మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా వ్యాపారాలను స్థాపించడానికి నైపుణ్యాలు ఉన్న, ఔత్సాహిక యువతకు DSEU ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సులను అందిస్తుంది. యువత సొంతంగా సంస్థలను ప్రారంభించడానికి, నిర్వహణ, మెంటర్‌షిప్ సపోర్ట్‌ను కూడా DSEU అందిస్తుంది.

Ukraine-Russia: ఉక్రెయిన్‌ యుద్ధంలో పుతిన్ తన లక్ష్యాలను సాధిస్తున్నారా..?యుద్ధం ముగినట్లేనా..?


తాజా ఒప్పందం సందర్భంగా SIDBI ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివసుబ్రమణియన్ రామన్ మాట్లాడారు. “ఎంటర్‌ప్రైజింగ్ నేషన్‌గా మన దేశం ముందు నుంచి బలంగా ఉంది. దేశంలో ఎంటర్‌ప్రైజ్ ఎకో సిస్టమ్‌ను మరింత పటిష్టం చేసేందుకు, ఉద్యోగాలు సృష్టించే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సులను ప్రమోట్ చేసేందుకు వివిధ సంస్థలు, యూనివర్సిటీలతో చేతులు కలపాలని Sidbi భావిస్తోంది. యువత కలలను ఎంటర్‌ప్రైజ్‌గా మార్చడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. ఇలాంటి ఫోకస్డ్ కోర్సుకు హాజరవడం ద్వారా, ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకునే నైపుణ్యం ఉన్న వ్యక్తి, ఎంటర్‌ప్రైజ్‌ను స్థాపించడానికి అనుభవం పొందగలరని మేము భావిస్తున్నాం’’ అని వివరించారు.

ఈ సందర్భంగా ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నిహారిక వోహ్రా కూడా మాట్లాడారు. SIDBIతో MOUపై సంతకం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. “SIDBIతో ఈ భాగస్వామ్యం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకో సిస్టమ్‌లో వినూత్న మార్పులకు దారి తీస్తుంది. యువ పారిశ్రామికవేత్తలకు, ప్రత్యేకించి మహిళా పారిశ్రామికవేత్తలకు నగరంలో సులభంగా వ్యాపారం చేయడానికి SIDBI సాయంతో ముందుకెళ్తున్నాం. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకు అవసరమైన ప్రాసెస్, సిస్టమ్‌ కోసం Sidbi సాయం తీసుకుంటాం. సీడ్ ఫండ్‌తో ఔత్సాహికులకు సపోర్ట్ చేయడం కంటే.. మైండ్ సెట్స్, ఏజెన్సీల నిర్మాణంపై పని చేయాలనే ఆలోచన ఉంది.’’ అని తెలిపారు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Desu, EDUCATION, Mission swavalamban, Sidbi, Students

ఉత్తమ కథలు