IIIT Admissions 2020: ట్రిపుల్ఐటీలో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష.. పూర్తి వివరాలివే..

IIIT Admissions 2020: ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది.

news18-telugu
Updated: October 21, 2020, 2:08 PM IST
IIIT Admissions 2020: ట్రిపుల్ఐటీలో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష.. పూర్తి వివరాలివే..
ట్రిపుల్ఐటీ నూజివీడు
  • Share this:
కరోనా నేపథ్యంలో దేశంలో అనేక పరీక్షలను వాయిదా వేశారు. కొన్ని పరీక్షలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పడు కొన్ని ప్రవేశ పరీక్షలను కరోనా నిబంధనలను పాటిస్తూ.. అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటూ నిర్వహిస్తున్నారు. ఏపీలో ఏటా పది పరీక్షల ఫలితాల ఆధారంగా ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలను నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా పది పరీక్షలను ప్రభుత్వం నిర్వహించలేదు. దీంతో 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల మార్కులు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ఐటీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు ఎలా నిర్వహించాలన్న అంశంపై ఇన్నాళ్లు స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఇందుకోసం ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఇందుకోసం ఆర్జీయూకేటీ చట్టంలోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్ష నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్జీయూకేటీ ఛాన్సలర్ కు సూచించారు.

పది సిలబస్ ప్రకారమే..

ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ పరీక్ష సిలబస్ పై సైతం క్లారిటీ ఇచ్చింది. పది సిలబస్ ప్రకారమే ఆ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరీక్ష తేదీలపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ తేదీలు, దరఖాస్తుల ప్రక్రియ తదితర వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. కరోనా నిబంధనలు పాటిస్తూ.. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
Published by: Nikhil Kumar S
First published: October 21, 2020, 2:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading