Home /News /jobs /

ENGLISH IN IBPS EXAM IS DREADED BY MANY BUT IF YOU STUDY AS MENTIONED HERE YOU CAN GET GOOD MARKS TPT VB

IBPS English Preparation Tips: ఐబీపీఎస్ పరీక్షలో ఇంగ్లీష్ అంటే భయమా.. అయితే ఇలా పట్టు సాధించండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

బ్యాంకు పరీక్షల్లో అందరూ ఛాయస్ లా ఇంగ్లీష్ ను వదిలేస్తున్నారు. కాని బాగా ఫోకస్ చేయాల్సింది ఇంగ్లీష్ సబ్జెక్టుపై మాత్రమేని తిరుపతి పేస్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ నిరంజన్ విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

    (GT Hemant Kumar, News18, Tirupati)

    బ్యాంకు పరీక్షల్లో అందరూ ఛాయస్ లా ఇంగ్లీష్(English) ను వదిలేస్తున్నారు. కాని బాగా ఫోకస్ చేయాల్సింది ఇంగ్లీష్ సబ్జెక్టుపై మాత్రమేని తిరుపతి(Tirupati) పేస్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ నిరంజన్ విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మనకు ఏదైతే స్మూత్ గా అనిపిస్తుందో అదే ఎక్కువగా డ్యామేజ్ చేస్తుందన్నారు. ఇంగ్లీష్ లో డిస్ క్వాలిపై అయ్యి.. సెక్షనల్ కట్ అఫ్ రీచ్ (Selection Of Reach) అవ్వలేని స్టూడెంట్స్ (Students) ఎక్కువగా ఉన్నారన్నారు. రీడింగ్ పార్ట్ ను బాగా ప్రాక్టీస్ చేయాలని సూచించారు. ఒకాబిలరీ బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎర్రర్స్ సంబంధించిన రూల్స్ కచ్చితంగా తెలుసుకోవాలన్నారు.

    SI Prelims Preparation: ఎస్ఐ ప్రిలిమ్స్ లో నెగెటివ్ మార్కులు ఉన్నా.. ఇలా ప్రపేర్ అయితే అర్హత సాధించొచ్చు..


    ఇంగ్లీష్ కు సంభందించి 120 రూల్స్ ఉంటాయి. వాటిని పూర్తిగా నేర్చుకోవాలి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో నాలుగు అంశాలు ప్రధానమైనవి. అందులో ఒకటి గ్రామర్, రెండవది ఒకాబిలరీ., మూడవది రీడింగ్., నాల్గవధీ లాజిక్. ఈ నాలుగు విభాగాలను ఇంగ్లీష్ లో ఫోకస్ చేయడం ద్వారా.. బ్యాంక్ పరీక్షలు ఏవైనా... మార్కులు మీ సొంతం అవుతాయి. బ్యాంకింగ్ పరీక్ష రాసే అభ్యర్థులు కష్టంగా భావించేది ఇంగ్లీష్ మాత్రమే. మిగిలిన సిబ్జెక్టులలో లాగా షార్ట్ కట్స్ ఇంగ్లీష్ కి ఉండదు.



    స్పెల్లింగ్ మిస్టేక్స్ అడుగుతూ ఉంటారు. ఫిల్లింగ్ ధీ బ్లాంక్స్ అడుగుతున్నారు. కొత్తగా వర్డ్ రీప్లేస్ మెంట్ అడుగుతున్నారు. మరియు మ్యాచ్ ది కాలమ్స్ అనే ప్రశ్నలు అడుగుతున్నారు. ఇలాంటి కొత్త కొత్త టాపిక్స్ సిలబస్ లో చేర్చడం జరిగింది. చాలామంది ఒకాబిలరీ సాల్వ్ చేయలేక ఫెయిల్ అవుతూ ఉంటారు. లిమిటెడ్ పార్ట్ అఫ్ ఒకాబిలరీ రావడమే ఇందుకు ప్రధాన కారణం. మూడువేల కొత్త పదాలు నేర్చుకోవడం ద్వారా... ఒక3బిలారీ చాల ఈజిగా సాల్వ్ చేయవచ్చు. బట్టి కొట్టే మెథడ్ కి వెళ్తే మాత్రం తప్పు చేసినట్లే అవుతుంది. చదువుకోవడం ద్వారా కొత్త కొత్త పదాలు అందుబాటులోకి వస్తాయి. చిన్నప్పటి నుంచి గ్రామర్ ను చదువుతూనే ఉన్నాం. పార్ట్స్ అఫ్ స్పీచ్., టెన్సెస్., ప్యాసివ్ వాయిస్., రిపోర్టెడ్ స్పీచ్., మోడల్ వర్క్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ అనే టాపిక్స్ ను తరావుగా చదువుకోవాలి. దీనికి ఓ బుక్ ను కొనుగోలు చేసి...పై టాపిక్స్ పై ప్రిపేర్ అవ్వవచ్చు.

    Singareni Vacancies: గుడ్ న్యూస్.. సింగరేణిలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ.. 1300 పోస్టులు ఖాళీ..


    ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం ద్వారా ఒకాబిలరీ తో పాటుగా రీడింగ్ కాన్సెప్ట్ ఫుల్ ఫిల్ చేయగలరు. రోజుకి రెండు గంటల సమయం న్యూస్ పేపర్ చదవడం ద్వారా జనరల్ నాలెడ్జ్ తో పాుట... న్యూ వర్డ్స్ ఐడెంటిఫికేషన్ ను గుర్తించవచ్చు. ఇలా చేస్తూ ప్రతీ పేరాలో వచ్చిన డిఫికల్ట్ వర్డ్ ను ఎనలైజ్ చేసి.. అండర్ లైన్ చేసుకోవాలి. డిక్షనరీ ద్వారా అర్థాలు తెలుసుకొని సాధన చేయాలి. లాజిక్స్ లో ముఖ్యంగా ఫారా జంపింగ్ అడుగుతున్నారు, పేరాగ్రాఫ్ ను జుంబుల్ చేసి ఇస్తారు. వాటిని మనం అర్థం వచ్చే పేరాగ్రాఫ్ లా మార్చాలి. దీనికి ముఖ్యంగా లాజికల్ థియరీ అవసరం ఉంటుంది. ఇందుకు లాజికల్ థింకింగ్ వర్డ్స్ చాల అవసరం.
    Published by:Veera Babu
    First published:

    Tags: Career and Courses, IBPS, Ibps clerks, JOBS, Preparation

    తదుపరి వార్తలు