హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Engineers' Day: ఇంజినీరింగ్ సేఫ్ ఆప్షన్ కాదా..? ఐఐటీ ఎంట్రన్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి ఎందుకు తగ్గింది..?

Engineers' Day: ఇంజినీరింగ్ సేఫ్ ఆప్షన్ కాదా..? ఐఐటీ ఎంట్రన్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి ఎందుకు తగ్గింది..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Engineers' Day: ప్రస్తుత గణాంకాలు చూస్తుంటే ఇంజినీరింగ్‌ కోర్సు పూర్వ వైభవాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల సంఖ్య తగ్గడం ఈ విశ్లేషణలకు బలం పెంచుతోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ప్రఖ్యాత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఏటా సెప్టెంబరు 15న ఇంజినీర్స్‌ డే (Engineers Day) నిర్వహిస్తారు. రోజువారీ జీవితంలో సైన్స్ (Science) తీసుకొచ్చిన మార్పులు, ఆవిష్కరణ వెనుక ఇంజినీర్ల కృషిని గౌరవించేందుకు ఇంజినీర్స్‌ డే జరుపుతారు. ఆధునిక ప్రపంచం అభివృద్ధి వెనుక ఇంజినీర్ల కృషి ఎంతో ఉంది. అయితే ఇండియాలో ఇంజినీరింగ్‌ కోర్సుల (Engineering Courses)కు డిమాండ్‌ చాలా ఎక్కువ. ప్రపంచ దేశాలలో పని చేస్తున్న ఇంజినీర్లలో ఇండియా (India) నుంచే ఎక్కువ మంది ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. కానీ ప్రస్తుత గణాంకాలు చూస్తుంటే ఇంజినీరింగ్‌ కోర్సు పూర్వ వైభవాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల సంఖ్య తగ్గడం ఈ విశ్లేషణలకు బలం పెంచుతోంది.

ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షల పోటీపై ఏఐసీటీఈ మాజీ చైర్‌పర్సన్ అనిల్ సహస్రబుధే మాట్లాడుతూ.. 150 మంది విద్యార్థుల్లో 149 మందికి ఐఐటీల్లో సీట్లు రావడం లేదని చెప్పారు. పోటీ ఎక్కువగా ఉండటం కారణంగానే ఇంజినీరింగ్‌ కోర్సులకు ఆదరణ తగ్గుతోందని అన్నారు. దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది విద్యార్థులలో కేవలం 2.5 లక్షల మంది మాత్రమే JEE అడ్వాన్స్‌డ్‌కు హాజరుకాగలరని, IIT ప్రవేశ దశలో మరింత ఫిల్టర్ అవుతుందని చెప్పారు.

* తగ్గుతున్న JEE మెయిన్‌ దరఖాస్తులు

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష JEE మెయిన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య నాలుగేళ్లలో 11 లక్షల మార్కును తాకలేదు. ప్రతిష్టాత్మకమైన ఐఐటీలలో కూడా ప్రవేశాలు తగ్గుతున్నాయి. JEE అడ్వాన్స్‌డ్‌ కాదని చాలా మంది విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను చదివేందుకు NITలకి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు.

ప్రతి సంవత్సరం JEE మెయిన్ నుంచి టాప్ 2.5 లక్షల ర్యాంకులు సాధించిన వారు JEE అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావడానికి అర్హత పొందుతారు. ప్రతి సంవత్సరం IIT ప్రవేశానికి అర్హత పొందిన విద్యార్థుల సంఖ్య 2.5 లక్షలకు పైగా ఉంది. అయితే గత ఏడు సంవత్సరాలలో 1.8 లక్షల కంటే తక్కువ మంది పరీక్షకు హాజరయ్యారు.

* తీవ్రమైన పోటీ

కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల ఖర్చు, కఠినమైన పోటీ విద్యార్థుల ఆలోచనలను మారుస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. జేఈఈ మెయిన్‌లో పాల్గొని, జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన విద్యార్థులకు అగ్రశ్రేణి NITలో సీటు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు టైర్-3 IITలో చేరడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే మద్రాస్, ఢిల్లీ , బొంబాయిలోని IIT సహా అగ్రశ్రేణి కళాశాలలకు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సులకు డిమాండ్‌ కనిపిస్తోంది.

* వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు కష్టం

అధిక పోటీ కారణంగా, కోచింగ్ తరగతులు తీసుకోకుండానే జాతీయ స్థాయి పరీక్షలో విజయం సాధించడం చాలా అరుదు. కొంతమంది ప్రతిభావంతులైన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ఫ్రీ కోచింగ్‌ పొందుతున్నారు. అయితే చాలా మంది నిరుపేద కుటుంబాల విద్యార్థులు క్వాలిటీ కోచింగ్ పొందలేరు.

ఇది కూడా చదవండి : స్టూడెంట్స్‌కు అలర్ట్.. ఈ నెలలో అప్లై చేసుకోవాల్సిన స్కాలర్‌షిప్స్ ఇవే..!

జేఈఈ అడ్వాన్స్‌డ్ వంటి పరీక్షలకు పాఠశాల స్థాయి విద్య మాత్రమే సరిపోదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐఐటీల కోసం పోటీపడే చాలా మంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు చాలా మంచి కోచింగ్ అవసరం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షల్లో పోటీపడటం కష్టమని 7 క్లాసెస్‌, ఇన్‌స్టాప్రెప్స్ సహ వ్యవస్థాపకుడు, IIT-బాంబే పూర్వ విద్యార్థి అనుప్ రాజ్ అన్నారు.

* ఇంజినీరింగ్‌ సేఫ్‌ ఆప్షన్‌ కాదు

JEE మెయిన్ 2022 టాపర్, పార్థ్ భరద్వాజ్ ఇటీవల news18.comతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఇంజినీరింగ్ అనేది కెరీర్‌కు సేఫ్ ఆప్షన్ కాదన్నాడు. ఐఐటీలలో దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి మెరిట్ లోపమే కాదు, ఆసక్తి లేకపోవడం కూడా కావచ్చని చెప్పారు. కెరీర్‌గా ఇంజినీరింగ్ ఇప్పుడు సేఫ్ ఆప్షన్ కాదని తెలిపాడు. భారతదేశంలోని దాదాపు 80 శాతం మంది ఇంజినీర్లు ఏ ఉద్యోగానికీ సరిపోరని పరిశోధనలు చెబుతున్నాయని చెప్పాడు. ఇంజినీరింగ్‌ తర్వాత యూపీఎస్పీ సివిల్స్‌ను తన టార్గెట్ అని భరద్వాజ్‌ వివరించాడు..

First published:

Tags: Career and Courses, Engineering course, Engineers, Jee advanced, JOBS

ఉత్తమ కథలు