Engineering Admissions: భారీగా తగ్గిన ఇంజనీరింగ్ సీట్లు... కోర్సులను రద్దు చేస్తున్న కాలేజీలు

Engineering Admissions: భారీగా తగ్గిన ఇంజనీరింగ్ సీట్లు... కోర్సులను రద్దు చేస్తున్న కాలేజీలు (ప్రతీకాత్మక చిత్రం)

Engineering Admissions | ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల సంఖ్య భారీగా తగ్గిపోతోందని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డేటా వెల్లడిస్తోంది.

  • Share this:
కరోనా ప్రభావంతో దేశంలోని అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా విద్యా వ్యవస్థపై మహమ్మారి ప్రభావం ఎక్కువగా పడింది. కరోనా దెబ్బకు స్కూళ్లు, కళాశాలలు నడపలేక ఏకంగా విద్యాసంస్థలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు విద్యార్థులు కూడా డిమాండ్​ ఉన్న కోర్సుల్లోనే చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఇంజినీరింగ్​ కాలేజీలు డిమాండ్​ లేని కోర్సులను రద్దు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో దేశంలో ఇంజినీరింగ్​ సీట్లు పదేళ్ల కనిష్టానికి పడిపోయాయని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఈ) వెల్లడించింది.

గత పదేళ్లలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా స్థాయిలలో ఇంజినీరింగ్ సీట్లు 23.28 లక్షలకు తగ్గాయి. ఈ ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా మొత్తం 63 ఇంజినీరింగ్​ కాలేజీలు మూతపడ్డాయి. ఈ కారణంగా 2‌021లోనే మొత్తం 1.46 లక్షల సీట్లు తగ్గిపోయాయి. ఇంజినీరింగ్​ సీట్లు గణనీయంగా పడిపోయినప్పటికీ టెక్నికల్​ ఎడ్యుకేషన్​లో 80 శాతం సీట్లతో ఇప్పటికీ ఇంజినీరింగ్​దే పైచేయి కావడం విశేషం. టెక్నికల్​ ఎడ్యుకేషన్​లోని ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్, హోటల్ మేనేజ్‌మెంట్, ఫార్మసీతో పోలిస్తే ఇంజినీరింగ్​ చదివే విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా ఉంది.

Indian Navy Jobs 2021: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు... విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

UPSC Recruitment 2021: జర్నలిజంలో అనుభవం ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... రూ.1,42,000 వేతనం

దశాబ్ద కనిష్టానికి పడిపోయిన సీట్లు..


2014–15లో దేశవ్యాప్తంగా దాదాపు 32 లక్షల ఇంజినింగ్ సీట్లు అందుబాటులో ఉండేవి. అయితే, కొన్ని కోర్సులకు డిమాండ్​ తగ్గడంతో సుమారు 400 ఇంజినీరింగ్ కళాశాలలు ఆయా కోర్సులను రద్దు చేసుకున్నాయి. మరోవైపు సీట్లు నిండక నిర్వహణ భారంతో అనేక కళాశాలలు మూతబడ్డాయి. ఇలా 2015–16 అకడమిక్​ ఇయర్​ నుంచి ప్రతి ఏటా కనీసం 50 ఇంజినీరింగ్ కాలేజీలను మూసేశారు. ఈ ఏడాది 63 కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతి నిరాకరించింది. దీంతో మరో 63 కాలేజీలు మూతపడనున్నాయి.

TCS National Qualifier Test: ఈ ఎగ్జామ్ రాయండి... కార్పొరేట్ కంపెనీలో జాబ్‌కి ట్రై చేయండి

SBI Jobs 2021: ఎస్‌బీఐలో 6100 ఉద్యోగాలు... ఎంపిక చేసేది ఇలాగే

2019, 2020లో కొత్త ఇంజినీరింగ్​ కాలేజీల ఏర్పాటుపై ఏఐసీటీఈ తాత్కాలిక నిషేధం విధించింది. ఐఐటి-హైదరాబాద్ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది. ఓవైపు కొత్త కాలేజీలు ఏర్పాటు కాకపోవడం, మరోవైపు కొన్ని కాలేజీలు డిమాండ్ లేని కోర్సులను రద్దు చేసుకోవడంతో ఇంజినీరింగ్ సీట్లు గణనీయంగా తగ్గాయి.
Published by:Santhosh Kumar S
First published: