స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (Staff Selection Commission) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో పలు విభాగాల్లో ఖాళీలుగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌లో 167 ఇంజనీరింగ్ విభాగం పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టుల దరఖాస్తుకు అక్టోబర్ 25చ, 2021 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు అనంతరం ఫీజు చెల్లించేందుకు అక్టోబర్ 28, 2021 రాత్రి 11.30 వరకు అవకాశం ఉంది. బ్యాంక్ ద్వారా చలాన్ రూపంలో ఫీజు చెల్లించేందుకు నవంబర్ 1, 2021 వరకు అవకాశం ఉంది. పోస్టుల ఎంపిక పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. ఈ పరీక్ష జనవరి 2022 లేదా ఫిబ్రవరి 2022లో జరిగే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తరువాత పరీక్ష తేదీలు విడుదల చేస్తారు.
ముఖ్యమైన సమాచారం..
సిరియల్ నంబర్ | పోస్టు పేరు | ఖాళీలు |
109 | జూనియర్ ఇంజనీర్ (డిఫెన్స్) | 29 |
110 | జూనియర్ ఇంజనీర్ (డిఫెన్స్) | 18 |
111 | జూనియర్ ఇంజనీర్(క్వాలిటీ అస్యూరెన్స్) | 10 |
112 | జూనియర్ ఇంజనీర్ (డిఫెన్స్) | 25 |
113 | జూనియర్ ఇంజనీర్ (ఈఈ) | 11 |
114 | జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) | 24 |
115 | జూనియర్ ఇంజనీర్ (M&E/Metallurgy) | 02 |
116 | జూనియర్ ఇంజనీర్(VMD) | 31 |
119 | జూనియర్ ఇంజనీర్ (RSM) | 15 |
165 | జూనియర్ ఇంజనీర్ (సీజీడబ్ల్యూబీ) | 1 |
206 | ఇన్‌స్ట్రక్టర్ (CIFNET) | 1 |
ఎంపిక విధానం..
- ఈ పోస్టుల భర్తీకి ప్రాథమికంగా కంప్యూటర్ బెస్డ్ (Computer Based Exam) పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్ష సమయం - 60 నిమిషాలు
- ఇది అబ్జెక్టీవ్ టైప్ (Objective type) ప్రశ్నలను కలిగి ఉంటుంది. అయితే పోస్టును బట్టి విద్యార్హతను బట్టి మూడు పరీక్షల వరకు నిర్వహించే అవకాశం ఉంది.
- పరీక్ష రాసే అభ్యర్థులు ఆచితూచి సమాధానం పెట్టాలి. ప్రతీ తప్పు ప్రశ్నకు 0.50 మార్కులు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
- పరీక్ష ఉత్తీర్ణులైన వారిని నైపుణ్య (Skill) పరీక్షకు పిలుస్తారు. ఎంపిక విధానంలో దరఖాస్తు చేసుకొన్న పోస్టుల ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం..
Step 1: దరఖాస్తు ప్రక్రియ రెండు భాగాలుగా ఉంటుంది.
Step 2: ముందుగా అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ను సందర్శించాలి.
Step 3: అందులో NOTICES లోకి వెళ్లి. OTHERS విభాగంలో నోటిఫికేషన్ చదవాలి. అనంతరం హోం పేజీకి వచ్చి దరఖాస్తు ప్రక్రియ మొదలు పెట్టాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4: మొదట వన్‌టైం రిజస్ట్రేషన్ చేసుకోవాలి.
JNTU(A) Exams : త్వరలో ఆన్‌లైన్‌లోనే సెమిస్టర్ పరీక్షలు : జేఎస్‌టీయూ(ఏ)
Step 5: అభ్యర్థి ప్రాథమిక విద్యార్హత, పాస్‌పోర్టు ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి ఫాం సబ్‌మిట్ చేయాలి.
Step 6: ఈ ప్రక్రియ అనంతరం అభ్యర్థికి రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ వస్తాయి.
Step 7: రెండో భాగంలో రిజిస్ట్రేషన్ నంబర్ పాస్ వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
Step 8: అనంతరం ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో క్లిక్ చేసి సమాచారం , ఫీజు చెల్లించి సబ్‌మిట్ చేయాలి.
Step 9: పరీక్షకు దరఖాస్తు చేసుకొనేందుకు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం క్యాటగిరీ అభ్యర్థులకు, మహిళలకు పరీక్ష ఫీజు లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Central Government, Govt Jobs 2021, Job notification, Ssc exams, Staff Selection Commission