PM Modi: తెలుగుతో పాటు ఐదు ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ బోధన.. శుభవార్త చెప్పిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

జాతీయ విద్యా విధానం(NEP) ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ ప్రజలనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    జాతీయ విద్యా విధానం(NEP) ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ ప్రజలనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. పేద, ఇతర వెనకబడిన వర్గాల వారికి విద్యను మరింత చేరువ చేసేందుకు ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన దోహదపడుతుందన్నారు. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ కోర్సులను ఐదు స్థానిక భాషల్లో బోధించనున్నట్లు ప్రధాని తెలిపారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఐదు ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన ప్రారంభం కానున్నట్లు ప్రధాని మోదీ వివరించారు. మొదటగా తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, బెంగాళీ భాషల్లో విద్యాబోధన ఉంటుందని వెల్లడించారు. ఇంకా ఇంజనీరింగ్ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా ప్రత్యేకంగా టూల్ ను కూడా అభివృద్ధి చేసినట్లు ఆయన చెప్పారు. దేశంలోని యువత ఆశయాలను అనుగుణంగా, వారు అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ కొత్త విద్యా విధానం దోహదపడుతుందని ప్రధాని తెలిపారు.
    7th Pay Commission: ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా

    నూతన విద్యా విధానం ద్వారా యువతకు దేశం తమ ఉంట ఉందనే భరోసా ఏర్పడుతుందన్నారు. ప్రాంతీయ భాషల్లో విద్యావిధానం విద్యార్థుల్లోని ఒత్తిడిని దూరం చేసేందుకు దోహదపడుతుందన్నారు. నూతన విద్యావిధానం ద్వారా లబ్ధిపొందనున్న ఈ తరమే రేపు దేశాన్ని సైతం ముందుకు నడిపిస్తుందని ప్రధాని ఆకాంక్షించారు.  కరోనా కష్టకాలంలోనూ నూతన విద్యా విధానాన్ని అమలుచేయడాన్ని ప్రధాని కొనియాడారు.

    ఇదిలా ఉంటే.. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డిప్లొమా, బీడీఎస్, ఎండీఎస్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేసేవారికి ఆల్ ఇండియా కోటా స్కీమ్‌లో ఓబీసీ విద్యార్థులకు 27 శాతం రిజర్వేషన్, ఎకనమికల్లీ వీకర్స్ సెక్షన్-EWS విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్ కేటాయిస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచే ఈ రిజర్వేషన్ అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో వైద్య విద్య అభ్యసించాలనుకునే 5,550 మంది విద్యార్థులు లాభపడనున్నారు. వెనుకబడిన వర్గాలు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నవారికి రిజర్వేషన్ కేటాయించడంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ తెలిపారు.

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2021 జూలై 26న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశంలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం సూచించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ఎంబీబీఎస్ చదవాలనుకునే 1500 ఓబీసీ విద్యార్థులు, 550 ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు, పీజీ చదవాలనుకునే 2500 ఓబీసీ విద్యార్థులు, 1000 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు మేలు చేయనుంది.
    Published by:Nikhil Kumar S
    First published: