హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Top Engineering Colleges: ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే, దేశవిదేశాల్లోని టాప్​ 15 ఇంజినీరింగ్ కాలేజీలివే..

Top Engineering Colleges: ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే, దేశవిదేశాల్లోని టాప్​ 15 ఇంజినీరింగ్ కాలేజీలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జేఈఈ ర్యాంకుతో కేవలం భారత్​లోనే కాదు విదేశాల్లోని ప్రతిష్టాత్మక వర్సిటీల్లోనూ ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో జేఈఈ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు దేశవిదేశాల్లో ఎంపిక చేసుకోగల అత్యుత్తమ ఇంజనీరింగ్ కాలేజీల వివరాలు మీ కోసం..

ఇంకా చదవండి ...

దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ(IIT), ఎన్​ఐటీ(NIT)ల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్​(JEE Mains), అడ్వాన్స్‌డ్​–2021 (JEE Advanced) పరీక్ష ఫలితాలు ఇటీవల వెలువడ్డాయి. ఫలితాల అనంతరం నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం విద్యార్థులంతా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. జాయింట్ అలోకేషన్ అథారిటీ (జోసా) ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తోంది. జేఈఈ ర్యాంకుతో కేవలం భారత్​(India)లోనే కాదు విదేశాల్లోని ప్రతిష్టాత్మక వర్సిటీల్లోనూ ప్రవేశాలు పొందవచ్చు. ఈ నేపథ్యంలో జేఈఈ(JEE) పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు దేశవిదేశాల్లో ఎంపిక చేసుకోగల అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలలను పరిశీలిద్దాం.

భారతదేశంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీలు:

నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్​ఐఆర్​ఎఫ్​)–2021 ఆధారంగా, ఇంజనీరింగ్​లో చేరేందుకు టాప్​–15 కళాశాలల వివరాలివే..

ర్యాంక్ 1: ఐఐటీ మద్రాస్

ర్యాంక్ 2: ఐఐటీ ఢిల్లీ

ర్యాంక్ 3: ఐఐటీ బాంబే

ర్యాంక్ 4: ఐఐటీ కాన్పూర్

ర్యాంక్ 5: ఐఐటీ ఖరగ్‌పూర్

ర్యాంక్ 6: ఐఐటీ రూర్కీ

ర్యాంక్ 7: ఐఐటీ గౌహతి

ర్యాంక్ 8: ఐఐటీ హైదరాబాద్

ర్యాంక్ 9: ఎన్​ఐటీ, తిరుచిరాపల్లి

ర్యాంక్ 10: ఎన్​ఐటీ, సూరత్కల్

ర్యాంక్ 11: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్)

ర్యాంక్ 12: వెల్లూర్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ, వెల్లూర్

ర్యాంక్ 13: ఐఐటీ, ఇండోర్

ర్యాంక్ 14: ఐఐటీ, బీహెచ్​యూ

ర్యాంక్ 15: ఇన్​స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ

PwC Hiring: కామర్స్, సీఏ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. సీనియర్ అసోసియేట్‌లను రిక్రూట్ చేసుకోనున్న పీడబ్ల్యూసీ సంస్థ

విదేశాల్లోని టాప్ 15 ఇంజినీరింగ్ కళాశాలలు

క్యూఎస్​ (క్వాక్వరెల్లి సైమండ్స్) ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్​ (WUR) ను ఏటా విడుదల చేస్తుంది. 2021లో ఇంజనీరింగ్​కి సంబంధించి అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) టాప్​ ప్లేస్​లో నిలిచింది. ఈ ర్యాంకింగ్​లో చోటు దక్కించుకున్న ప్రపంచంలోని టాప్​ 15 యూనివర్సిటీలను పరిశీలిద్దాం.

TCS Jobs: ఆ కోర్సు పాస్ అయినవారికి టీసీఎస్‌లో ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు

ర్యాంక్ 1: MIT, యునైటెడ్ స్టేట్స్

ర్యాంక్ 2: స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, యునైటెడ్ స్టేట్స్

ర్యాంక్ 3: కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, యూకే

ర్యాంక్ 4: జ్యూరిచ్ - స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్విట్జర్లాండ్

ర్యాంక్ 5: నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ, సింగపూర్

ర్యాంక్ 6: యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, యూకే

ర్యాంక్ 7: యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ

ర్యాంక్ 8: ఇంపీరియల్ కాలేజ్ లండన్

ర్యాంక్ 9: నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్

ర్యాంక్ 10: సింగువా యూనివర్సిటీ, చైనా

ర్యాంక్ 11: హార్వర్డ్ యూనివర్సిటీ, యునైటెడ్ స్టేట్స్

ర్యాంక్ 12: EPFL స్విట్జర్లాండ్

ర్యాంక్ 13: జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూఎస్​

ర్యాంక్ 14: కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్), యూఎస్​

ర్యాంక్ 15: డెల్ఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, నెదర్లాండ్స్

Published by:Nikhil Kumar S
First published:

Tags: Career and Courses, Engineering, Engineering course, IIT, India, JEE Main 2021

ఉత్తమ కథలు