హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main: మరో నాలుగు రోజుల్లో జేఈఈ మెయిన్ పరీక్ష.. వాయిదా కోసం విద్యార్థుల డిమాండ్!

JEE Main: మరో నాలుగు రోజుల్లో జేఈఈ మెయిన్ పరీక్ష.. వాయిదా కోసం విద్యార్థుల డిమాండ్!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

JEE Main: జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు గత నెల రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా  #JEEMain2023inApril అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. 

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ జేఈఈ మెయిన్ -2023 (JEE Main) సెషన్-1 పరీక్షలు జనవరి 24 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. అయితే జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు గత నెల రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా #JEEMain2023inApril అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు జనవరి 24 నుంచి ప్రారంభమై, ఫిబ్రవరి 1 వరకు కొనసాగనున్నాయి. అయితే ఆ తరువాత వారం రోజుల్లో కొన్ని బోర్డుల వార్షిక పరీక్షలు స్టార్ట్ కానున్నాయని, దీంతో బోర్డ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ కావడానికి సమయం ఉండదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా జేఈఈ మెయిన్ సెషన్-1, బోర్డ్ ప్రాక్టికల్ ఎగ్జామ్2తో క్లాష్ అవుతుందని పేర్కొన్నారు. జేఈఈ మెయిన్ సెషన్-1‌ను వాయిదా వేయాలని కొంత మంది విద్యార్థులు ఇప్పటికే బాంబే హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే పరీక్షను వాయిదా వేయడానికి కోర్టు నిరాకరించింది.

* ఆ రాష్ట్రాల్లో ఇలా..

అస్సాం బోర్డ్ ప్రాక్టికల్స్ జనవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. బీహార్ బోర్డ్ ప్రాక్టికల్స్ జనవరి 10, తెలంగాణ బోర్డ్ ప్రాక్టికల్స్ జనవరి 20 నుంచి స్టార్ట్ కానున్నాయి. అయితే ఈ పరీక్షలన్నీ జేఈఈ మెయిన్ సెషన్ -1 పరీక్షతో క్లాష్ అవుతున్నాయని అభ్యర్థులు ఎన్‌టీఏ దృష్టికి తెచ్చారు.

* విద్యార్థుల స్పందన

జేఈఈ మెయిన్ సెషన్-1 వాయిదా కోసం ట్విట్టర్ వేదికగా అభ్యర్థులు ఆందోళన చేపడుతున్నారు. ‘చాలామంది విద్యార్థులకు JEE పరీక్షల సమయంలోనే ప్రాక్టికల్స్ ఉన్నాయి. అందుకే జేఈఈ మెయిన్ సెషన్ -1 వాయిదా వేయండి. ఒకవేళ కుదరకపోతే ప్రాక్టికల్స్ అయినా వాయిదా వేయండి. లేకపోతే విద్యార్థులు నష్టపోతారు.’ అంటూ ఓ అభ్యర్థి ట్వీట్ చేశాడు.

‘జేఈఈ మెయిన్ సరిగ్గా షెడ్యూల్ చేయలేదు. దీంతో ప్రిపరేషన్‌‌కు సరిపడా సమయం లేదు. మరోపక్క ప్రాక్టికల్స్ ఉన్నాయి. దేనికి సన్నద్ధం కావాలో అర్థం కావట్లేదు. అంతా గందరగోళంగా ఉంది.’ అని మరో స్టూడెంట్ ట్వీట్ చేశాడు.

* స్పందించని ఎన్‌టీఏ..

జేఈఈ మెయిన్ కోసం షెడ్యూల్‌ను నెల క్రితం ఎన్‌‌టీఏ ప్రకటించింది. అప్పుడే CBSE బోర్డు ప్రాక్టికల్ పరీక్షలతో క్లాష్ అవుతుందని విద్యార్థులు ఎన్‌టీఏ దృష్టికి తెచ్చారు. ఐఐటీ, NITల్లో BTech, BE, BArch కోర్సుల్లో ప్రవేశానికి 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ - 2023 మార్కులు ఎంతో కీలకమని, దీంతో JEE మెయిన్ 2023 పరీక్షను ప్రీ-బోర్డ్‌ల సమయంలో ఎందుకు షెడ్యూల్ చేశారని విద్యార్థులు NTAను ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎగ్జామ్ ఏజెన్సీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

First published:

Tags: Career and Courses, EDUCATION, JEE Main 2023, JOBS

ఉత్తమ కథలు