హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs in Bounce: బౌన్స్ స్టార్టప్‌లో భారీగా ఉద్యోగాలు... డిగ్రీ, బీటెక్, బీఈ పాసైనవారికి అవకాశం

Jobs in Bounce: బౌన్స్ స్టార్టప్‌లో భారీగా ఉద్యోగాలు... డిగ్రీ, బీటెక్, బీఈ పాసైనవారికి అవకాశం

Jobs in Bounce: బౌన్స్ స్టార్టప్‌లో భారీగా ఉద్యోగాలు... డిగ్రీ, బీటెక్, బీఈ పాసైనవారికి అవకాశం
(ప్రతీకాత్మక చిత్రం)

Jobs in Bounce: బౌన్స్ స్టార్టప్‌లో భారీగా ఉద్యోగాలు... డిగ్రీ, బీటెక్, బీఈ పాసైనవారికి అవకాశం (ప్రతీకాత్మక చిత్రం)

Jobs in Bounce | బౌన్స్ స్టార్టప్ ఇంజనీర్, మేనేజర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దేశంలోని పలు నగరాల్లో ఈ ఖాళీలున్నాయి. డిగ్రీ, బీటెక్, బీఈ పాసైనవారు అప్లై చేయొచ్చు.

భారతదేశంలో మొదటి స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్ స్టార్టప్ అయిన బౌన్స్‌లో (Bounce) దేశవ్యాప్తంగా పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. డిగ్రీ, బీటెక్, బీఈ పాసైనవారు ఈ ఉద్యోగాలకు (Jobs) అప్లై చేయొచ్చు. విద్యార్హతలతో పాటు అనుభవం తప్పనిసరి. బౌన్స్‌లోని ఆపరేషన్స్, మెయింటనెన్స్, ప్లాంట్ ఆపరేషన్, సోర్సింగ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ లాంటి విభాగాల్లో ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతల వివరాలన్నీ పూర్తిగా చదివిన తర్వాత ఇమెయిల్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. మరి ఏ విభాగంలో ఏఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి? విద్యార్హతలేంటీ? ఎలాంటి స్కిల్స్ ఉండాలి? ఎలా అప్లై చేయాలి? తెలుసుకోండి.

Engineer: ఆపరేషన్స్ విభాగంలో ఇంజనీర్ పోస్టులున్నాయి. బెంగళూరులో ఈ ఖాళీలున్నాయి. బ్యాచిలర్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ (ఈసీ, మెకాట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమికల్స్) పాసైనవారు అప్లై చేయొచ్చు. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల అనుభవం ఉండాలి. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

Operations Executive: బెంగళూరులో ఆపరేషన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులున్నాయి. ఏదైనా డిగ్రీ పాసైనవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు అనుభవం తప్పనిసరి. పూర్తి వివరాలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

Clerk Jobs 2022: డిగ్రీ అర్హతతో ప్రభుత్వ బ్యాంకుల్లో 6,035 క్లర్క్ ఉద్యోగాలు... ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే

Maintenance Engineer: మెయింటనెన్స్ విభాగంలో మెయింటనెన్స్ ఇంజనీర్ పోస్టులున్నాయి. మహారాష్ట్రలోని భివాండిలో ఈ పోస్టులున్నాయి. ఎలక్ట్రికల్ లేదా మెకట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ లేదా డిప్లొమా పాసైనవారు అప్లై చేయొచ్చు. 1 నుంచి 3 ఏళ్ల అనుభవం తప్పనిసరి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Engineer: ప్లాంట్ ఆపరేషన్ విభాగంలో ఇంజనీర్ పోస్టులున్నాయి. హర్యానా లోని గుర్గావ్‌లో ఈ పోస్టులున్నాయి. ఏదైనా డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల అనుభవం తప్పనిసరి. ఇక్కడ క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

Manager Quality: క్వాలిటీ విభాగంలో మేనేజర్ క్వాలిటీ పోస్టులున్నాయి. మహారాష్ట్రలోని భివాండిలో ఈ పోస్టులున్నాయి. గతంలో క్వాలిటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన అనుభవం, స్కిల్స్ ఉన్నవారు అప్లై చేయొచ్చు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

Coal India Recruitment 2022: కోల్ ఇండియాలో 1050 జాబ్స్... నెలకు రూ.50,000 వేతనం

Manager SEO: మార్కెటింగ్ విభాగంలో మేనేజర్ ఎస్ఈఓ పోస్టులున్నాయి. బెంగళూరులోని కార్యాలయంలో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పాసైనవారు అప్లై చేయొచ్చు. మూడేళ్ల పైన అనుభవం ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

Supplier Quality Engineer: సోర్సింగ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ విభాగంలో సప్లయర్ క్వాలిటీ ఇంజనీర్ పోస్టులున్నాయి. మహారాష్ట్రలోని భివాండిలో ఈ పోస్టులున్నాయి. బీఈ లేదా బీటెక్ పాసైనవారు అప్లై చేయొచ్చు. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల అనుభవం తప్పనిసరి. ఇక్కడ క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.

కంపెనీ గురించి


మొబిలిటీ సొల్యూషన్ స్టార్టప్ బౌన్స్ 2018 మే లో ప్రారంభమైంది. వివేకానంద హల్లికేరి, అనిల్ జీ, వరుణ్ అగ్ని మానసపుత్రికే బౌన్స్ స్టార్టప్. రోజువారీ ప్రయాణం ఒత్తిడి లేకుండా, వేగంగా, నమ్మకంగా, సౌకర్యవంతంగా చేసే లక్ష్యంతో బౌన్స్ భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్‌గా ప్రారంభించబడింది. రైడ్-షేరింగ్ అవతార్‌తో, వివిధ రోజువారీ ప్రయాణికుల కోసం సరసమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తోంది. సుదూర ప్రాంతాలను కవర్ చేయడం నుంచి లాస్ట్ మైల్ సపోర్ట్ వరకు అన్ని అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ప్రారంభమైంది.

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్‌లో ఉద్యోగాలు... దరఖాస్తుకు నాలుగు రోజులే గడువు

బెంగళూరులో మొదట లాంఛైనా ఆ తర్వాత కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరు ప్రాంతాలకు విస్తరించింది. మొదటి ఏడాదిలోనే 30,000 పైగా స్కూటర్లతో రోజుకు 1,00,000 పైగా రైడ్స్ చేయడం విశేషం. రోజూ లక్షకు పైగా ట్రాన్సాక్షన్స్‌తో భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందిన స్టార్టప్‌గా ఎదగడం విశేషం. మొదటి 11 నెలల్లోనే 500 మిలియన్ యూఎస్ డాలర్ల వ్యాల్యుయేషన్ చేరుకుంది. షేరింగ్ మొబిలిటీ బిజినెస్‌ను విస్తరిస్తూ, బౌన్స్ జ్యూనిక్‌లో ఇన్వెస్ట్ చేసింది. బౌన్స్ ఇన్ఫినిటీ పేరుతో భారతదేశంలోనే మొదటి స్వాపబుల్ బ్యాటరీ గల ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చింది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Bounce, CAREER, JOBS, Private Jobs

ఉత్తమ కథలు