EMPLOYEES STATE INSURANCE CORPORATION ESIC HYDERABAD RELEASED NOTIFICATION FOR 35 POSTS SS
ESI Jobs: హైదరాబాద్‌లోని ఈఎస్ఐలో జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
ESI Jobs: హైదరాబాద్‌లోని ఈఎస్ఐలో జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
ESIC Hyderabad Recruitment 2020 | హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ హాస్పిటల్, మెడికల్ కాలేజీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివరాలు తెలుసుకోండి.
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC హైదరాబాద్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 35 ఖాళీలను భర్తీ చేస్తోంది. అవసరాలను బట్టి ఈ ఖాళీల సంఖ్య పెరగొచ్చు లేద తగ్గొచ్చు. సూపర్ స్పెషాలిస్ట్, స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్స్ లాంటి పోస్టులున్నాయి. సనత్‌నగర్‌లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్, ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 ఏప్రిల్ 26 చివరి తేదీ. అభ్యర్థులకు ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈఎస్ఐ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ https://www.esic.nic.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 35
సూపర్ స్పెషలిస్ట్- 10
స్పెషలిస్ట్- 1
సీనియర్ రెసిడెంట్- 24
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 26 సాయంత్రం 6 గంటలు
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.