హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

EPFO: మార్చిలో ఈ ఆర్థిక సంవత్సరం ఈపీఎఫ్ వడ్డీ ప్రకటన.. వివరాలివే

EPFO: మార్చిలో ఈ ఆర్థిక సంవత్సరం ఈపీఎఫ్ వడ్డీ ప్రకటన.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈపీఎఫ్ వడ్డీని మార్చి మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈపీఎఫ్ వడ్డీని మార్చి మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉంది. రిటైర్మెంట్ ట్రస్టీలు శ్రీనగర్ లో సమైవేశమై ఆర్థిక పరిస్థితిమై సమీక్షించనున్నారు. ఈపీఎఫ్ఓ సోమవారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(CBT)కి లేఖ రాసింది. సమావేశాన్ని మార్చి 4న నిర్వహించడంపై లేఖలో పేర్కొన్నారు. మీటింగ్ ఎజెండా రానున్న రోజుల్లో ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ చందాదారులకు వడ్డీ మొత్తం జమ చేసినట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది జరిగి నెల రోజులు దాటుతున్నా.. ఇంకా 40 లక్షల మంది ఖాతాదారులకు వడ్డీ చెల్లింపుల ప్రక్రియ పూర్తి కాక పోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. KYC వివరాల్లో సమస్యలు తదితర కారణాలతో ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల్లో వడ్డీ జమ చేయడంలో జాప్యం తలెత్తుతోంది.

2019-20 సంవత్సరానికి గాను గతేడాది డిసెంబర్‌ 31 నాటికి ఈపీఎఫ్‌ వడ్డీని జమ చేస్తామని ఈపీఎఫ్‌ఓ గతంలో వెల్లడించింది. పీఎఫ్‌ కార్పస్‌ ఫండ్ పై 8.5 శాతం వడ్డీ రేటు చొప్పున ఆరు కోట్ల మంది ఉద్యోగుల ఖాతాల్లో ఒకేవిడతలో జమ చేస్తామని వెల్లడించింది. అయితే వీరిలో 8 నుంచి 10 శాతం వరకు ఖాతాదారులకు ఇప్పటివరకూ వడ్డీ జమకాలేదు. అయితే చెల్లింపుల్లో ఆలస్యంపై ఉద్యోగుల వివరాలను ఈపీఎఫ్‌ఓ క్షేత్రాధికారులు ఆయా యాజమాన్యాలను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. EPFO తాజాగా ఎలక్ట్రానిక్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రిన్సిపల్ ఎంప్లాయర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు ఇప్పుడు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ విధానంలో ప్రిన్సిపల్ ఎంప్లాయర్లు తమ కాంట్రాక్టర్ల ఈపీఎఫ్ కాంప్లయర్స్ సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌ఓలో నమోదు చేయించుకున్న కొంతమంది యజమానులు కాంట్రాక్టర్ల ద్వారా ఉద్యోగులను నియమించుకుంటారు. వీరు ఇప్పుడు EPFO పోర్టల్‌లో సులభంగా తమ కింద పనిచేసే కాంట్రాక్టర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను నమోదు చేయవచ్చు. కొత్త సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఈపీఎఫ్‌ఓ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రిన్సిపల్ ఎంప్లాయర్స్ కోసం ఈ సదుపాయాన్ని ప్రారంభించామని, వీరు ఇప్పుడు తమ కాంట్రాక్టర్ల EPF కాంప్లయన్స్‌ను సులభంగా చూసుకోవచ్చని ఈపీఎఫ్ఓ ట్వీట్ చేసింది.

First published:

Tags: Employees Provident Fund Organisation, EPFO

ఉత్తమ కథలు