Home /News /jobs /

EMPLOYEES AMIT SHAH TELLS GOOD NEWS TO CHANDIGARH EMPLOYEES CENTRAL CIVIL SERVICES RULES WILL BE IMPLEMENTED SOON GH VB

Employees: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన అమిత్ షా.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి.. వివరాలిలా..

అమిత్ షా (ఫైల్)

అమిత్ షా (ఫైల్)

కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ (Chandigarh)లోని ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీపి కబురు అందించారు. ప్రస్తుతం పంజాబ్ సర్వీస్ రూల్స్ కింద పనిచేస్తున్న చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగులకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ (Central Civil Services Rules) అమలు చేస్తామని అమిత్ షా ప్రకటించారు.

ఇంకా చదవండి ...
కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ (Chandigarh)లోని ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీపి కబురు అందించారు. ప్రస్తుతం పంజాబ్ సర్వీస్ రూల్స్ కింద పనిచేస్తున్న చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగులకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ (Central Civil Services Rules) అమలు చేస్తామని మార్చి 27న అమిత్ షా ప్రకటించారు. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీనితో ఏప్రిల్ ఫస్ట్ నుంచి చండీగఢ్ ఉద్యోగులు కేంద్ర సివిల్ సర్వీసులతో సమానమైన బెనిఫిట్స్ పొందుతారు. ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాత రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. ఈ నిర్ణయంతో మోదీ సర్కార్ పంజాబ్ రాష్ట్ర హక్కులు అతిక్రమించిందంటూ పంజాబ్ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
మోదీ సర్కార్ తాజా నిర్ణయంతో చండీగఢ్ ఉద్యోగులందరికీ సెంట్రల్ సర్వీస్ రూల్స్ ప్రకారం పే స్కేల్ లభించడమే కాకుండా, పదవీ విరమణ వయస్సు (Retirement Age) 58 నుంచి 60 ఏళ్లకు పెరుగుతుందని అమిత్ షా చెప్పుకొచ్చారు.

కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పుడు మహిళా ఉద్యోగులందరికీ ఒక ఏడాదికి బదులుగా రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్ (Child Care Leave) లభిస్తుంది. అమిత్ షా మాట్లాడుతూ, “నేను చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించాలనుకుంటున్నా. నేటి నుంచి కేంద్ర సివిల్‌ సర్వీస్‌ రూల్స్‌కు అనుగుణంగా చండీగఢ్ ఉద్యోగుల సర్వీసులు ఉండాలని నిర్ణయించాం. పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60కి పెంచడం వల్ల ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. విద్యా శాఖలో ఉన్న వారి పదవీ విరమణ వయస్సు 65కి పెరుగుతుంది. అలాగే, మహిళలకు ప్రస్తుతం ఉన్న ఒక సంవత్సరానికి బదులుగా చైల్డ్ కేర్ లీవ్స్ రెండేళ్లకు పెరుగుతాయి." అని అన్నారు.

CBDC: సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ అంటే ఏంటి..? CBDC గురించి ఆర్‌బీఐ తెలియజేసిన వివరాలు ఏంటి..?


“ఈ డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. ఈ నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం వస్తుంది. కొత్త ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది" అని షా పేర్కొన్నారు. ఆదివారం నాడు అమిత్ షా పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి చండీగఢ్ విచ్చేశారు. ఈ క్రమంలోనే ఆయన అక్కడి ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. ఈ ప్రకటన తర్వాత పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అయిన చండీగఢ్ ఉద్యోగుల చిరకాల డిమాండ్ ఎట్టకేలకు నెరవేరిందని బీజేపీ నాయకుడు సత్యపాల్ జైన్ అన్నారు. చండీగఢ్ ఉద్యోగి ఇప్పుడు సెంట్రల్ సర్వీస్ రూల్స్ ప్రకారం అన్ని అలవెన్స్‌లను పొందుతారని సత్యపాల్ వెల్లడించారు. అలానే, ఈ సిటీ ఉద్యోగులు ఇప్పుడు తమ పిల్లలకు 12వ తరగతి వరకు ఎడ్యుకేషన్ అలవెన్స్ తో పాటు కన్వెయన్స్ అలవెన్స్ కూడా పొందుతారు.

Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 133 మంది ప్రయాణికులతో పర్వతాల్లో కుప్పకూలిన బోయింగ్ .. బూడిదేనా?


అయితే ఉద్యోగులు బీజేపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపగా, ఈ నిర్ణయంపై పంజాబ్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అకాలీ నాయకుడు దల్జిత్ చీమా ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ, ట్వీట్ చేశారు. “చండీగఢ్ ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వ నిబంధనలను విధించాలని MOH తీసుకున్న నిర్ణయం పంజాబ్ రీఆర్గ్ చట్టం (Punjab Reorg Act) స్ఫూర్తిని ఉల్లంఘించడమే. దానిని పునఃపరిశీలించాలి. ఈ నిర్ణయం పంజాబ్‌ రాజధాని హక్కును శాశ్వతంగా కాలరాస్తోంది." అని అన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఈ నిర్ణయంపై స్పందించారు. పంజాబ్‌లో ఆప్ ఎదుగుదలకు బీజేపీ భయపడుతోందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Published by:Veera Babu
First published:

Tags: Amit Shah, Chandigarh, Employees, Punjab

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు