ECIL Jobs: ఈసీఐఎల్‌లో జాబ్స్... ఆగస్ట్ 26, 27న వాక్ ఇన్ ఇంటర్వ్యూ

ECIL Jobs | ఇవి రెండేళ్ల కాంట్రాక్ట్ పోస్టులు. ప్రాజెక్ట్ అవసరాలను బట్టి కాంట్రాక్ట్ పొడిగించే అవకాశముంది. ఎంపికైన వారు న్యూ ఢిల్లీలో సెక్యూరిటీ సిస్టమ్స్ అండ్ ప్రాజెక్ట్స్ డివిజన్‌లో పనిచేయాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: August 24, 2019, 10:27 AM IST
ECIL Jobs: ఈసీఐఎల్‌లో జాబ్స్... ఆగస్ట్ 26, 27న వాక్ ఇన్ ఇంటర్వ్యూ
ECIL Jobs: ఈసీఐఎల్‌లో జాబ్స్... ఆగస్ట్ 26, 27న వాక్ ఇన్ ఇంటర్వ్యూ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 24, 2019, 10:27 AM IST
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. డిప్లొమా పూర్తి చేసినవారు 2019 ఆగస్ట్ 26, 27 తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. మొత్తం 28 పోస్టులున్నాయి. ఇవి రెండేళ్ల కాంట్రాక్ట్ పోస్టులు. ప్రాజెక్ట్ అవసరాలను బట్టి కాంట్రాక్ట్ పొడిగించే అవకాశముంది. ఎంపికైన వారు న్యూ ఢిల్లీలో సెక్యూరిటీ సిస్టమ్స్ అండ్ ప్రాజెక్ట్స్ డివిజన్‌లో పనిచేయాల్సి ఉంటుంది. సైంటిఫిక్ అసిస్టెంట్-ఏ పోస్టుకు ఆగస్ట్ 26న, ఆఫీస్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ పోస్టుకు ఆగస్ట్ 27న ఇంటర్వ్యూ ఉంటుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈసీఐఎల్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ECIL Recruitment 2019, ECIL jobs, ECIL Scientific Assistant posts, Diploma Jobs, latest jobs, ఈసీఐఎల్ రిక్రూట్‌మెంట్ 2019, ఈసీఐఎల్ ఉద్యోగాలు, ఈసీఐఎల్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్స్, డిప్లొమా ఉద్యోగాలు, ఉద్యోగ ప్రకటనలు, జాబ్స్
Source: ECIL

ECIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే...



మొత్తం పోస్టులు- 28
సైంటిఫిక్ అసిస్టెంట్-ఏ కాంట్రాక్ట్ (Cat-1,ECE): 23 పోస్టులు


సైంటిఫిక్ అసిస్టెంట్-ఏ కాంట్రాక్ట్ (Cat-2,EEE): 03 పోస్టులు
సైంటిఫిక్ అసిస్టెంట్-ఏ కాంట్రాక్ట్ (Cat-3,R & A/Mechanical): 01 పోస్టు
Loading...
ఆఫీస్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్: 01 పోస్టు
విద్యార్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమాలో 60% మార్కులతో ఫస్ట్‌ క్లాస్‌లో పాస్ కావాలి. కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి. ఆఫీస్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ పోస్టుకు మూడేళ్ల బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీలో 60 శాతం మార్కులతో పాస్ కావాలి. మూడేళ్ల అనుభవం ఉండాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే అడ్రస్:
ECIL Zonal Office, D-15,
DDA Local Shopping Complex,
A-Block Ring Road, Naraina,
New Delhi -110 028.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

IAF Jobs: యువకులకు గుడ్ న్యూస్... ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్‌లో ఉద్యోగాలు

Air India Jobs: ఎయిర్ ఇండియాలో 214 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Naval Dockyard Jobs: నావల్ డాక్‌యార్డ్‌లో 1233 అప్రెంటీస్ పోస్టులు
First published: August 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...