Home /News /jobs /

ELECTRIC VEHICLE MOBILITY SOLUTIONS COMPANY MAGENTA AIMS TO HIRE OVER 340 EMPLOYEES HERE THE DETAILS GH VB

Job Alert: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ కంపెనీలో 340 ఉద్యోగాలు.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్, మొబిలిటీ సొల్యూషన్స్ కంపెనీ మెజెంటా.. ఎంట్రీ, మిడ్-లెవల్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ అభ్యర్థుల నుంచి వివిధ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ సంస్థకు బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో ఆఫీసులు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
ప్రముఖ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్, మొబిలిటీ(Mobility) సొల్యూషన్స్ కంపెనీ మెజెంటా.. ఎంట్రీ(Entry), మిడ్-లెవల్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ అభ్యర్థుల నుంచి వివిధ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ సంస్థకు బెంగళూరు, హైదరాబాద్(Hyderabad), ఢిల్లీలో ఆఫీసులు ఉన్నాయి. ఇక్కడ కార్యకలపాల నిర్వహణ కోసం కొత్తగా 340 మంది ఉద్యోగులను నియమించుకోవాలని మెజెంటా నిర్ణయించుకుంది. ఎంబెడెడ్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్, టెలిమాటిక్స్‌ రంగాల్లో నిర్దిష్ట సాంకేతిక నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తోంది. అదేవిధంగా హెచ్‌ఆర్(HR), ఫైనాన్స్(Finance), మార్కెటింగ్(Marketing), కమ్యూనికేషన్స్‌(Communications) విభాగంలో టాలెంట్ ఉన్న అభ్యర్థులను నియమించుకుంటున్నట్లు మెజెంటా ప్రకటించింది.

Do not tattoo: యువతకు అలర్ట్.. ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఈ పని మాత్రం చేయొద్దు

ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ‌పై మెజెంటా వ్యవస్థాపక డైరెక్టర్ మాక్స్సన్ లూయిస్ మాట్లాడుతూ...2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సాధించిన వృద్ధిని దృష్టిలో పెట్టుకుని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి బలమైన వృద్ధి ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. భారత్‌తోపాటు విదేశాల్లో EV పర్యావరణ వ్యవస్థ పెరుగుదలకు అవసరమైన ప్రణాళికలను టాంగోలో రూపొందించామని ఆయన తెలిపారు. కంపెనీ వృద్ధి లక్ష్యాలను సాధించాలంటే తదుపరి 6 నుంచి 12 నెలలు ఎంతో కీలకమన్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు వ్యాపార డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 340 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని కంపెనీ నిర్ణయించిందని లూయిస్ చెప్పుకొచ్చారు.

మెజెంటాకు చెందిన టాలెంట్ అక్విజిషన్ టీమ్.. మల్టిపుల్ క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ డ్రైవ్‌లలో చురుకుగా పాల్గొననుంది. తద్వారా టైర్ 1, టైర్ 2 ఇన్‌స్టిట్యూట్‌‌ల నుంచి అభ్యర్థులను రిక్రూట్ చేసుకోనుంది. కాగా, 2017లో స్థాపించిన మెజెంటా కంపెనీ.. సమగ్ర క్లీన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా సేవలు అందిస్తోంది. అలాగే క్లైయిట్లు స్థిరత్వ లక్ష్యాలను సాధించడానికి వీలుగా సొల్యూషన్స్ రూపొందించడం ఈ కంపెనీ ప్రత్యేకత.

మరోపక్క, దేశీయ టెక్ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ 2021 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 61వేల ఉద్యోగులను క్యాంపస్ రిక్రూట్‌మెంట్ చేసుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియాకాలను ఈ రెండు కంపెనీలు భారీగా చేపట్టనున్నాయి. టీసీఎస్ 1,00,000, ఇన్ఫోసిస్ 85వేల మంది ప్రెషర్లను రిక్రూట్ చేసుకోనున్నాయి.

Telangana Exam Tips: కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా.. ఎక్కు స్కోర్ సాధించేందుకు ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి!

వచ్చే ఆర్థిక సంవత్సరం(2023)లో మరో 50వేల మంది ప్రెషర్లకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. టీసీఎస్ కూడా ఇన్ఫోసిస్ దారిలోనే నడిచే అవకాశం ఉంది. గతేడాది చేపట్టిన విధంగానే ఈసారి కూడా నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. దాదాపు 40,000 నియామకాల లక్ష్యంతో కంపెనీ ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తోందని.. అవసరమైతే ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని టీసీఎస్ తెలిపింది. మరో సాప్ట్‌వేర్ దిగ్గజం యాక్సెంచర్ కూడా దేశవ్యాప్తంగా 30,000 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆగస్టు 31, 2021 నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా దాదాపు 2,50,000 మందిని యాక్సెంచర్ ఇప్పటికే రిక్రూట్ చేసుకుంది. నియామకాల్లో ఇదే వేగంతో కొనసాగితే, ఆగస్టు 2022 చివరి నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,00,000ను దాటగలదని పోర్టల్ నివేదిక తెలిపింది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Magenta, Recruitment

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు