ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology) మద్రాస్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్‌లో ఎనిమిది నెలల డిప్లొమా ప్రోగ్రామ్ (Diploma program)లను ప్రారంభిస్తోంది. డిప్లొమా ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ నేపథ్యం అవసరం లేదు. ఏ విభాగంలోనైనా డిగ్రీ చేస్తే చాలు. కనీసం రెండు సంవత్సరాలు (Two Years) గ్రాడ్యుయేషన్ కోర్సు చేస్తే చాలు ఈ డిప్లమా కోర్సు చేయవచ్చు. ఈ కోర్సు ద్వారా విద్యార్థులు విస్తృతమైన విషయ పరిజ్ఞానాన్ని పొందవచ్చని ఐఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఏ డిగ్రీ చేసినా ఈ కోర్సుకు అర్హత పొందవచ్చు. ఇది ఐఐటీ మద్రాస్ అధికారిక డిప్లమా కూడా దీని ద్వారా ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు వారి ఉపాధి అవకాశాలను మెరుగు పర్చుకోవచ్చు.
ఈ కోర్సులో క్లాస్రూమ్ లెర్నింగ్ అనుభవంతో పోటీపడే సమగ్ర లెర్నింగ్ (Learning) డెలివరీ మోడల్ రూపంలో రూపందించారు. అభ్యాసకుల ప్రతీ ప్రశ్నకు సమాధానం ఇచ్చేలా కోర్స్ రూపొందించారు. ఐఐటీ మద్రాస్ నుంచి లైవ్ సెషన్ (Live Sessions)లు నిర్వహిస్తారు. కోర్సుకు సంబంధించి మూల్యాంకనం (Evaluation) ఇన్-పర్సన్ క్విజ్ రూపంలో ఉంటుంది. అంతే కాకుండా ఎండ్-టర్మ్ (End term) పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతీ సబ్జెక్ట్‌పై అభ్యాసకుడికి విషయ పరిజ్ఞానం పెరిగేలా బోధన అందిస్తారు.
IIT Recruitment 2021 : ఐఐటీ మండీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. అర్హతలు, వేతనం వివరాలు
ఈ ఆన్లైన్ దరఖాస్తు పోర్టల్‌ని అక్టోబర్ 4, 2021న ఐఐటీ మద్రాస్‌లో ప్రొఫెసర్ అనిల్ సహస్రబుధే, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) చైర్మన్, తిరుమల ఆరోహి, ఇన్ఫోసిస్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రొఫెసర్ భాస్కర్ రామమూర్తి సమక్షంలో ఐఐటి డైరెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఐఐటీ మద్రాస్ (IIT Madras) డైరెక్టర్ ప్రొఫెసర్ భాస్కర్ రామమూర్తి మాట్లాడారు. వ్యక్తిగత పరిశీలనతో కలిసి ఆన్లైన్ లర్నింగ్ (Online Learning) నిర్వహిస్తున్నామని అన్నారు. అభ్యాసకుల అభివృద్ధికి కోర్సును సరళతరం చేశామన్నారు. ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (Education) స్పేస్‌లో అధ్యాపకుల అనుభవం అభ్యాసకులకు ఉపయోగపడేలా బోధన ఉంటుదన్నారు. ఎంతో ఉపయుక్తంగా ఆకర్షణీయంగా ఈ కోర్సు ఉంటుందనడంలో సందేహం లేదని ఆయన అన్నారు.
ఈ కోర్సులో చేరే అభ్యర్థుల సామాజిక - ఆర్థిక నేపథ్యం ఆధారంగా 75శాతం వరకు ఫీజు రాయితీ ఇస్తామని ఇన్స్టిట్యూట్ పేర్కొంది. ఈ ప్రోగ్రాంలో పే-యాస్-యు-గో (pay-use-you-go) మోడల్ అమలుచేస్తారు.
అంటే ఎప్పటికప్పుడు కావల్సిన కోర్సును డబ్బు చెల్లించి చదువుకోవచ్చు. దీని ద్వారా అభ్యాసకులకు ఆర్థిక వెసులుబాటు ఉంటుందని ఇన్స్టిట్యూట్ పేర్కొంది. కోర్సులో లైవ్ క్లాస్‌లు.. అసైన్మెంట్లు, ప్రాజెక్టులు, స్వీయ పరిష్కార నైపుణ్యం బలోపేతం అవ్వడానికి వీలుగా కోర్సు ఉంటుందని ఇన్స్టిట్యూట్ తెలిపింది.
దరఖాస్తు చేసుకొనే విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది.
Step 1 : ముందుగా అధికారిక వెబ్సైట్ https://diploma.iitm.ac.in/ ను సందర్శించాలి.
Step 1 : అనంతరం కోర్సు విధానం పూర్తిగా చదవాలి. అందుకోసం https://diploma.iitm.ac.in/admissions.html#AD4 ఈ లింక్‌లోకి వెళ్లాలి.
Step 1 : కోర్సు స్ట్రక్చర్, ఫీజు వివరాలు చూసి దరఖాస్తు చేసుకోవాలి.
Step 1 : దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 15, 2021 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EDUCATION, IIT Madras, New course, Online Education