Jobs: హైదరాబాద్‌లోని ఇఫ్లూలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

EFLU Recruitment 2020 | నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-EFLU 58 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: May 29, 2020, 3:57 PM IST
Jobs: హైదరాబాద్‌లోని ఇఫ్లూలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Jobs: హైదరాబాద్‌లోని ఇఫ్లూలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-EFLU ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వేర్వేరు విభాగాల్లో టీచింగ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ లాంటి ఖాళీలున్నాయి. మొత్తం 58 పోస్టులున్నాయి. హైదరాబాద్‌తో పాటు షిల్లాం, లక్నోలోని రీజనల్ క్యాంపస్‌లలో ఈ ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 15 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.efluniversity.ac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్‌ను ఇదే వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.

EFLU Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...



మొత్తం ఖాళీలు- 58
ప్రొఫెసర్- 18
అసోసియేట్ ప్రొఫెసర్- 27
అసిస్టెంట్ ప్రొఫెసర్- 13
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 15 సాయంత్రం 6 గంటలువిద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Registrar,
The English and Foreign Languages University,
near Tarnaka,
Hyderabad - 500007

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

SEBI Internship: సెబీలో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్... అప్లై చేయండిలా

Govt Jobs: సెబీలో ఉద్యోగాలకు మరోసారి దరఖాస్తు గడువు పెంపు

DRDO Jobs: డీఆర్‌డీఓలో 185 ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు
First published: May 29, 2020, 3:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading