హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AICTE: మే 16న ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌‌ టెక్స్ట్‌బుక్ లాంచ్.. ఆవిష్కరించనున్న కేంద్ర మంత్రి.. వివరాలివే

AICTE: మే 16న ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌‌ టెక్స్ట్‌బుక్ లాంచ్.. ఆవిష్కరించనున్న కేంద్ర మంత్రి.. వివరాలివే

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మే16వ తేదీ సోమవారం నాడు భారతీయ నాలెడ్జ్ సిస్టమ్‌పై (Indian Knowledge System) రూపొందించిన పాఠ్య పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నారని AICTE తెలిపింది. ఈ పుస్తకాన్ని IIM బెంగళూరు ప్రొఫెసర్ B. మహదేవన్ రాశారు.

ఇంకా చదవండి ...

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (dharmendra pradhan) మే16వ తేదీ సోమవారం నాడు భారతీయ నాలెడ్జ్ సిస్టమ్‌పై (Indian Knowledge System) రూపొందించిన పాఠ్య పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నారని AICTE తెలిపింది. ఈ పుస్తకాన్ని IIM బెంగళూరు ప్రొఫెసర్ B. మహదేవన్ రాశారు. పుస్తక రూపకల్పనలో బెంగళూరు SVYASA, ఎర్నాకులంలోని చిన్మయ విశ్వవిద్యాపీఠ్ సహాయ సహకారాలు అందించాయి. 2022 మే16న బుద్ధ పూర్ణిమ శుభ సందర్భంగా AICTE ఆడిటోరియంలో సాయంత్రం 4:30 నుండి 6:00 గంటల వరకు జరిగే ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను AICTEతో పాటు IKS (ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్) విభాగం చూసుకుంటుంది. భారతీయ విజ్ఞాన వ్యవస్థపై రూపొందించిన ఈ పాఠ్యపుస్తకాన్ని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్... పుస్తక రచయిత, సహ రచయితలు, పలువురు ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించనున్నారని ఏఐసీటీఈ వెల్లడించింది.

టెక్నికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) 2018లో తన మోడల్ కరిక్యులమ్ కింద ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ (lKS)పై తప్పనిసరి కోర్సును ప్రవేశపెట్టింది. అయితే, ఆ సమయంలో IKSపై ప్రామాణికమైన పాఠ్యపుస్తకం లేదని AICTE చెప్పుకొచ్చింది. అంతకు ముందే, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) బెంగళూరు నుంచి భారతీయ నాలెడ్జ్ సిస్టమ్‌పై ఒక కోర్సు రూపొందించడం కోసం కరిక్యులం డెవలప్‌మెంట్, టెక్స్ట్‌బుక్ తయారీ ప్రాజెక్ట్ ప్రతిపాదన స్వీకరించామని కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది. మోడల్ కరిక్యులమ్‌లో ప్రవేశపెట్టిన యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ కోర్సులను బోధించడానికి ప్రాథమిక రిఫరెన్స్ మెటీరియల్‌గా ఉపయోగించేందుకు ఈ పుస్తకానికి రూపకల్పన చేసినట్లు AICTE పేర్కొంది.

AICTE: ఏఐసీటీఈ స్పెషల్ ప్రోగ్రామ్.. నాన్-టెక్నికల్ విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ పోర్టల్ పరిధి పెంపు

మరోవైపు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) మరో కీలక నిర్ణయం తీసుకుంది. అకడమిక్ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకు థిరిటికల్ నాలెడ్జ్ పెంపొందించడానికి, ప్రాక్టికల్ లెర్నింగ్‌లో పైచేయి సాధించడానికి తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఇవి టెక్నికల్, నాన్-టెక్నికల్ విద్యార్థులకు వర్తిస్తాయని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే AICTE 2019లో ఇంటర్న్‌షిప్ పోర్టల్ internship.aicte-india.orgను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Internship Guidelines: రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ కోసం UGC తాజా మార్గదర్శకాలు... మార్పులు ఇవే

తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ పోర్టల్‌లో లక్ష ఇంటర్న్‌షిప్ అవకాశాలను ప్రకటించడంతో ఇక ఇది ఊపందుకోనుంది. ఇంటర్న్‌షిప్‌ల కోసం దేశ విదేశాల్లోని అనేక పరిశ్రమలు, శిక్షణా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖల సహకారాన్ని AICTE తీసుకోనుంది. పోర్టల్‌ను మరింతగా విస్తరించడానికి సేల్స్‌ఫోర్స్, RSB ట్రాన్స్‌మిషన్, CISCO, ఇన్ఫోసిస్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ డివిజన్, మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్ (MGNCRE) తదితర సంస్థల సహకారంతో దాదాపు 15 లక్షలకు పైగా ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌లను విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకొస్తుంది ఏఐసీటీఈ.

First published:

Tags: Aicte, Career and Courses, EDUCATION, Exams

ఉత్తమ కథలు