Home /News /jobs /

EDUCATION MINISTER LAUNCHES BOOK ON INDIAN KNOWLEDGE SYSTEM FOR ENGINEERING STUDENTS DETAILS HERE GH VB

Book Launch: ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌పై సరికొత్త పుస్తకం.. ఆవిష్కరించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి..

పుస్తక ఆవిష్కరణలో మంత్రి

పుస్తక ఆవిష్కరణలో మంత్రి

కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ‘ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ పరిచయం- కాన్సెప్ట్స్ అండ్ అప్లికేషన్స్’ పై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ‘ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ పరిచయం- కాన్సెప్ట్స్ అండ్ అప్లికేషన్స్’ పై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ (IKS)పై అవసరమైన కోర్సును అందించడం కోసం ఈ పుస్తకం(Book) మార్గదర్శకంగా ఉంటుందని AICTE( ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) తెలిపింది. బెంగళూరులోని వ్యాస యోగా ఇన్‌స్టిట్యూట్, ఎర్నాకులంలోని చిన్మయ విశ్వ విద్యాపీఠ్‌ సహకారంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) బెంగళూరు ఈ పుస్తకాన్ని రూపొందించింది. IIM బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్. బి మహదేవన్ ఈ పుస్తకాన్ని సంకలనం చేశారు. చాణక్య యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ వినాయక్ రజత్ భట్, ఎర్నాకులంలోని చిన్మయ్ విద్యాపీఠ్‌లోని వేదిక్ స్కూల్‌కు చెందిన ఆర్. ఎన్ నాగేంద్ర పవన్ సహ రచయితలుగా ఉన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. భారతీయ నాలెడ్జ్ సిస్టమ్‌ కోసం అవసరమైన అకడమిక్ ఫ్రేమ్‌వర్క్‌ని ఈ పుస్తకం ద్వారా రచయితలు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వేదాలు, ఉపనిషత్తులు ఇతర భారతీయ గ్రంథాల గురించి కేంద్ర మంత్రి మాట్లాడారు. మన ప్రాచీన వారసత్వం, సంపదతో నిండి ఉందని, వాటిని సంరక్షించడం కోసం డాక్యుమెంట్ రూపంలో భద్రపర్చాలన్నారు. అలాగే వాటిని విస్తృతంగా ప్రచారం చేయడం కూడా అవసరమని చెప్పారు.

Inspiring: పట్టు వదలని విక్రమార్కుడు.. చివరకు ఇలా..! ప్రతీ విద్యార్థి చదవాల్సిన స్టోరీ..


ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత విద్యావ్యవస్థ బలోపేతం అవుతోందన్నారు. గత ప్రాచీన కాలం నుంచి మంచి విషయాలను స్వీకరించేటప్పుడు, సమాజంలోని సమస్యలను కూడా గుర్తుంచుకోవాలని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. గతం, ప్రస్తుత సమకాలీన సమస్యల నుండి జ్ఞానానికి మధ్య సమన్వయాన్ని సృష్టించే భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోని అనేక సమస్యలకు భారతీయ జ్ఞాన వ్యవస్థలో పరిష్కారాలు ఉన్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు.

మరోవైపు, నూతన విద్యా విధానం (NEP) ప్రకారం... ఉన్నత విద్యా పాఠ్యాంశాల్లో IKSని అందించడానికి ఈ పుస్తకం స్పష్టమైన మార్గాన్ని అందించిందని, రాబోయే రోజుల్లో దేశంలోని అనేక ఉన్నత విద్యా సంస్థల్లో ఈ పుస్తకం అవసరం ఎంతైనా ఉంటుందని కేంద్ర విద్యా శాఖ పేర్కొంది. అలాగే గతంతో తిరిగి కనెక్ట్ అయ్యే అవకాశాన్ని అందించడం ద్వారా సంప్రదాయ, ఆధునిక విద్యా వ్యవస్థ మధ్య అంతరాన్ని తగ్గించడానికి వీలు కల్పిస్తుందని పేర్కొంది. సంపూర్ణ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి, బహుళ విభాగాల పరిశోధన, ఆవిష్కరణలు చేయడానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

State Bank Of India: ఎస్‌బీఐ రుణగ్రహీతలకు అలర్ట్.. పెరగనున్న EMIలు..?


కాగా, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ (IKS)ను 2020 అక్టోబర్‌లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో AICTE స్థాపించింది. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌ అన్ని అంశాలపై ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనను ప్రోత్సహించనుంది. కళలు, సాహిత్యం, వ్యవసాయం, ప్రాథమిక శాస్త్రాలు, ఇంజనీరింగ్ & సాంకేతికత, ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్‌లో దేశ వారసత్వాన్ని, సాంప్రదాయ విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడంలో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ చురుకుగా పాల్గొంటుంది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Union minister

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు