• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • EDUCATION LOAN KNOW HOW TO APPLY FOR EDUCATION LOAN ON VIDYALAKSHMI WEBSITE SS

Education loan: చదువుకోవడానికి లోన్ కావాలా? ఈ వెబ్‌సైట్‌లో అప్లై చేయండి

Education loan: చదువుకోవడానికి లోన్ కావాలా? ఈ వెబ్‌సైట్‌లో అప్లై చేయండి

Education loan: చదువుకోవడానికి లోన్ కావాలా? ఈ వెబ్‌సైట్‌లో అప్లై చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

Vidyalakshmi Education Loan | ఎడ్యుకేషన్ లోన్ కావాలనుకునే విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన విద్యాలక్ష్మి పోర్టల్‌లో దరఖాస్తు చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  • Share this:
    టాలెంట్ ఉన్నా ఆర్థిక పరిస్థితి వల్ల ఉన్నత చదువులు చదవలేకపోతున్నారా? మీ ప్రతిభకు ఆర్థిక సమస్యలు అడ్డంకిగా మారాయా? అయితే బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఉన్నత విద్య అభ్యసించొచ్చు. ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి పేరుతో ఓ వెబ్‌సైట్ ప్రారంభించింది. https://www.vidyalakshmi.co.in/ వెబ్‌సైట్‌లో విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేయొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనెరా బ్యాంకు లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ లాంటి ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లో లోన్స్ ఇస్తాయి. 36 బ్యాంకుల నుంచి 110 లోన్ స్కీమ్స్ అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ ఉన్నత విద్య అవసరాలకు తగ్గట్టుగా ఇందులోంచి లోన్ స్కీమ్ ఎంచుకోవచ్చు.

    విద్యార్థులు ముందుగా https://www.vidyalakshmi.co.in/ వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలోనే Apply Now ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. అందులో మీ పేరు, తండ్రి పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ లాంటి వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి యాక్టివేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి యాక్టివేషన్ చేయాలి. ఆ తర్వాత లోన్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. ముందుగా కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి. మీ ఇన్‌కమ్ ప్రూఫ్స్, ఐడీ ప్రూఫ్స్, సర్టిఫికెట్స్ అన్నీ అందుబాటులో ఉంచుకోవాలి. బ్యాంకులో ఎడ్యుకేషన్ స్కీమ్ సెలెక్ట్ చేసి దరఖాస్తు చేసేందుకు ఈ ఫామ్ ఉపయోగపడుతుంది. లోన్‌కు దరఖాస్తు చేసే ముందు నియమనిబంధనలన్నీ పూర్తిగా చదవడం తప్పనిసరి.

     
    First published: