హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Education Loan: విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తున్నారా..? విద్యా రుణాన్ని ఇలా తెలివిగా ఉపయోగించుకోండి..

Education Loan: విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తున్నారా..? విద్యా రుణాన్ని ఇలా తెలివిగా ఉపయోగించుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విదేశీ చదువుల కోసం లోన్‌లను తీసుకొంటున్నప్పుడు లోన్ ఫీచర్‌లను అలాగే, రీపేమెంట్ సామర్థ్యాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

భారతదేశం(India) నుంచి ఏటా చాలా మంది విద్యార్థులు(Students) విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తుంటారు. ఇటీవల విదేశాల్లో చదువులకు చాలా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఈ వ్యయం గత కొన్ని దశాబ్దాలుగా బాగా పెరిగింది. మన దేశంలో ఉన్న పెద్ద బ్యాంకులు (Banks), కొన్ని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (Non Banking Financial Companies) విదేశీ విద్య కోసం రుణాలను అందజేస్తున్నాయి. పెద్ద రుణ మొత్తాలు, వర్క్ వీసాలపై(Work Visa) అధిక పరిమితులు అప్పుల్లో మిగిలిపోయే ప్రమాదాన్ని పెంచుతాయి. విదేశీ చదువుల కోసం లోన్‌లను(Loans) తీసుకొంటున్నప్పుడు లోన్ ఫీచర్‌లను(Feature) అలాగే, రీపేమెంట్(Re Payment) సామర్థ్యాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు రుణ గ్రహీతలు లోన్ అమౌంట్ తిరిగి చెల్లించే ప్లానింగ్, ఇందుకు సంబంధించిన రీపేమెంట్ పీరియడ్, మార్జిన్ మనీ వంటి అనేక అంశాలపై దృష్టి పెట్టాలి. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Astrology | Solar Eclipse: ఏప్రిల్ 30న సూర్యగ్రహణం.. గ్రహణ అమావాస్య కారణంగా ఆ రాశులవారు జాగ్రత్త..


* లోన్‌ అమౌంట్‌ (Loan Amount)

విదేశాల్లో చదువు కోసం వెళ్లిన విద్యార్థి కోర్సు ఫీజు, ప్రయాణ ఖర్చులు, హాస్టల్ ఫీజు, ల్యాప్‌టాప్, పుస్తకాలు, ఇతర పరికరాలకు ఎడ్యుకేషన్‌ లోన్ మొత్తం సరిపోతుంది. ఆఫ్‌షోర్ ఎడ్యుకేషన్ కోర్సుల కోసం అందించే లోన్ మొత్తం రూ.1.5 కోట్ల వరకు ఉంటుంది. మొత్తం వడ్డీ ధరను తగ్గించడానికి లోన్ మొత్తానికి అధిక మార్జిన్ అందించడానికి ప్రయత్నించాలి. రుణదాతలు విద్యార్థుల స్కాలర్‌షిప్ లేదా అసిస్టెంట్‌షిప్ డబ్బును మార్జిన్ కాంట్రిబ్యూషన్‌గా ఉపయోగించడానికి కూడా అనుమతిస్తారు.

* రీపేమెంట్‌ పీరియడ్‌ (Repayment Period)

స్థానిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లకు విద్యా రుణాల మాదిరిగానే, విదేశీ కోర్సులు తీసుకోవడానికి పొందిన రుణాలకు 15 సంవత్సరాల వరకు తిరిగి చెల్లించే వ్యవధి ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్ కోసం చెల్లింపును ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌(EMI) ప్రారంభం నుండి లెక్కిస్తారు. రుణం మంజూరు చేసిన తేదీ నుండి కాదు. రుణగ్రహీతలు కోర్సు వ్యవధితో సహా ఒక సంవత్సరం మారటోరియం వ్యవధిని కూడా అందిస్తారు. ఈ సమయంలో వారు ఎటువంటి EMIలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే రుణం పంపిణీ జరిగిన వెంటనే వడ్డీ భాగం సేకరణ ప్రారంభమవుతుంది. కాబట్టి విద్యా రుణాలు తీసుకునే వారు మారటోరియం వ్యవధిలో వారి పెరిగిన వడ్డీని తిరిగి చెల్లించడానికి ప్రయత్నించాలి. ఇది మొత్తం వడ్డీ వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

* మార్జిన్ మనీ(Margin Money)

మార్జిన్ మనీ అనేది ఎడ్యుకేషన్ లోన్ ద్వారా ఫైనాన్స్ చేయని కోర్సు ఫీజు నిష్పత్తిని సూచిస్తుంది. రుణగ్రహీత తప్పనిసరిగా అతని లేదా ఆమె సొంతంగా ఈ భాగానికి నిధులు సమకూర్చాలి. ఈ మొత్తంలో విద్యార్థి స్కాలర్‌షిప్ లేదా అసిస్టెంట్‌షిప్ డబ్బు కూడా ఉండవచ్చు. రుణదాతలు సాధారణంగా రూ.4 లక్షల వరకు రుణ మొత్తాలకు ఎలాంటి మార్జిన్ మనీ అవసరం లేదు. రూ.4 లక్షల కంటే ఎక్కువ రుణాల కోసం, రుణదాతలు సాధారణంగా విదేశీ కోర్సులను అభ్యసించడానికి అయ్యే ఖర్చులో 15 శాతం మార్జిన్ మనీని సూచిస్తారు.

* వడ్డీ రేటు(Interest Rate)

రుణదాతలు సాధారణంగా ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో విద్యా రుణాలను అందిస్తారు. విదేశీ కోర్సుల కోసం పొందే రుణాల వడ్డీ రేట్లు సాధారణంగా భారతీయ ఇన్‌స్టిట్యూట్‌లలో అభ్యసించే కోర్సులకు వసూలు చేసే రేటు కంటే ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం రుణదాత, కోర్సు రకం, సంస్థ, విద్యా పనితీరు, అందించే భద్రత, రుణగ్రహీత/సహ-దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోర్ ఆధారంగా విదేశీ కోర్సులకు విద్యా రుణ వడ్డీ రేట్లు సంవత్సరానికి 8 శాతం నుండి ప్రారంభమవుతాయి. మారటోరియం వ్యవధిలో, రుణదాతలు లోన్ మొత్తంపై సాధారణ వడ్డీని విధిస్తారు. మారటోరియం వ్యవధిలో వడ్డీ భాగాన్ని తిరిగి చెల్లించడంపై రుణదాతలు 1 శాతం వడ్డీ రాయితీలను కూడా పొందే అవకాశం ఉంది.

Infinix New Smart Phone: కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ కంపెనీ.. బడ్జెట్ ధరల్లో అందుబాటులోకి..


* EMIలను లెక్కించడానికి భవిష్యత్తు ఆదాయాలను అంచనా వేయండి

ఎంచుకున్న విద్యాసంస్థ ప్లేస్‌మెంట్ చరిత్రను, ప్లేస్‌మెంట్ సమయంలో అందించే సగటు వేతనాన్ని విశ్లేషించండి. వర్క్ వీసాలపై ఆంక్షలు కూడా తెలుసుకోవాలి. ఆశించిన నెలవారీ ఆదాయాన్ని సుమారుగా అంచనా వేయడానికి, తదనుగుణంగా మీ లోన్ కాలపరిమితి, EMIని ప్లాన్ చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. EMIలు చెల్లించకపోవడం వల్ల మీ క్రెడిట్ స్కోర్, భవిష్యత్తులో ఇతర లోన్‌లకు అర్హత తగ్గుతుంది.

* పన్ను ప్రయోజనాలు (Tax Benifts)

స్వీయ, జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా గార్డియన్‌ సంరక్షణలో ఉన్న పిల్లల కోసం విద్యా రుణాలను పొందుతున్న వ్యక్తులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80E కింద పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు. ఈ మినహాయింపుకు ఎగువ పరిమితి లేదు కానీ EMI రీపేమెంట్ ప్రారంభమైన రోజు నుండి ఎనిమిది సంవత్సరాలు మాత్రమే పొందవచ్చు.

* పూచీకత్తు/లోన్ హామీదారు (Collaterals/guarantor of loan)

రుణదాతలు సాధారణంగా రూ.4 లక్షల వరకు విద్యా రుణాల కోసం కొలేటరల్ లేదా థర్డ్-పార్టీ గ్యారెంటీ కోరరు. రూ.4 లక్షల నుంచి రూ. 7.5 లక్షల మధ్య ఉన్న విద్యా రుణాల కోసం, రుణదాతలు థర్డ్-పార్టీ గ్యారెంటర్, సెక్యూరిటీని అందించమని అడగవచ్చు. అయినప్పటికీ కొంతమంది దరఖాస్తుదారు తిరిగి చెల్లింపు సామర్థ్యం లేదా నికర విలువతో సంతృప్తి చెంది ఉంటే థర్డ్-పార్టీ గ్యారెంటర్‌ అవసరం లేదని చెబుతారు. రూ. 7.5 లక్షల కంటే ఎక్కువ ఉన్న విద్యా రుణాల కోసం రుణదాతలు ఆస్తి, బ్యాంక్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్స్, బీమా పాలసీలు మొదలైన వాటి రూపంలో స్పష్టమైన భద్రత చూపాలని సూచించవచ్చు.

First published:

Tags: Bank loan, Career and Courses, EDUCATION

ఉత్తమ కథలు