EDTECH STARTUP TUTOROOT OFFERS TRAIN THE TEACHER FREE ONLINE CERTIFICATION PROGRAMME KNOW HOW TO ENROLL SS
Tutoroot: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్... ఉచితంగా ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్
Tutoroot: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్... ఉచితంగా ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్
(ప్రతీకాత్మక చిత్రం)
Tutoroot | మీరు ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నారా? ఆన్లైన్ సెషన్స్ నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఆన్లైన్ క్లాసులు ఎలా తీసుకోవాలో నేర్పించేందుకు ఉచితంగా ఆన్లైన్ కోర్స్ అందిస్తోంది ఓ సంస్థ.
ఉపాధ్యాయులకు శుభవార్త. 'ట్రైన్ ది టీచర్' పేరుతో ఉచితంగా ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది ఎడ్టెక్ స్టార్టప్ అయిన ట్యూటరూట్. ఉపాధ్యాయులు, స్కూళ్లు ఈ ఉచిత ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ పొందొచ్చు. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసుల హవా నడుస్తోంది. అయితే చాలావరకు ఉపాధ్యాయులు ఆన్లైన్ బోధనలో శిక్షణ తీసుకోవచ్చు. వారికి ఆన్లైన్లో తరగతుల్ని ఎలా తీసుకోవాలనే అవగాహన కల్పించేందుకు ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. ఆన్లైన్లో బోధించడం దగ్గర్నుంచి టెస్టులు ఎలా నిర్వహించాలి, అసెస్మెంట్ ఎలా నిర్వహించాలనేదానిపై అవగాహన లభిస్తుంది.
బీఎస్ఈలో లిస్ట్ అయిన ఐటీ సర్వీసెస్ కంపెనీ గ్లోబల్ టెక్నాలజీస్‌కు చెందిన ఎడ్టెక్ స్టార్టప్ ట్యూటరూట్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఎడ్టెక్ స్టార్టప్‌ను ప్రారంభించింది గ్లోబల్ టెక్నాలజీస్. CVIAC టెక్నాలజీస్, స్కూల్స్ ఫర్ ఇండియా ట్రస్ట్‌తో కలిసి ఉచితంగా ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అందిస్తోంది. త్వరలో అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. 2021 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో సేవలు అందించనుంది. ఐఐటీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో ఈ స్టార్టప్‌ను నిర్వహిస్తోంది.
'ట్రైన్ ది టీచర్' ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లో మొత్తం 12 సెషన్లు ప్రోగ్రామ్ ఉంటుంది. ఒక్కో సెషన్ ఓ గంట మాత్రమే ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తిచేసిన ఉపాధ్యాయులకు 'సర్టిఫైడ్ వర్చువల్ టీచర్' సర్టిఫికెట్ లభిస్తుంది. ఆ తర్వాత ఉపాధ్యాయులు లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్, ఆన్లైన్ టూల్స్ ద్వారా తరగతులు నిర్వహించొచ్చు. లైవ్ ఇంటరాక్టీవ్ తరగతులు, అడాప్టీవ్ అసెస్మెంట్స్, లైవ్ సిమ్యులేషన్, సబ్జెక్ట్ డెమొ వీడియోస్, ఐఐటీ జేఈఈ, నీట్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీసీఎస్ఈ, ఐబీ కరుక్యులమ్కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోర్స్వేర్కు యాక్సెస్ లభిస్తుంది. ఆసక్తిగల ఉపాధ్యాయులు https://www.tutoroot.com/vmentor వెబ్సైట్లో ఎన్రోల్ చేసుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.