Home /News /jobs /

ECIL RECRUITMENT 2022 APPLICATIONS INVITING FOR 1625 JR TECHNICIAN POSTS HERE APPLICATION LINK NS

ECIL Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. ECILలో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 1625 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

    ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 1625 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్ టెక్నీషియన్ విభాగంలో ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు ఆఖరి తేదీగా ఏప్రిల్ 11ను నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

    ఖాళీల వివరాలు:
























    పోస్టుఖాళీలు
    ఎలక్ట్రానిక్స్ మెకానిక్814
    ఫిట్టర్627
    ఎలక్ట్రీషియన్184
    మొత్తం1625

    వేతనాల వివరాలు:
    ఈ ఖాళీలకు ఎంపికైన వారికి మొదటి ఏడాది రూ.20,480 వేతనంగా చెల్లించనున్నారు. రెండో ఏడాది రూ.22,528, మూడో ఏడాది రూ.24,790 వేతనంగా చెల్లించనున్నారు.
    Jobs in AP: ఏపీలోని ఆ జిల్లాలో జాబ్స్.. దరఖాస్తుకు మరో 3 రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

    విద్యార్హతల వివరాలు:
    అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ఎలక్ట్రీషియన్/ఫిట్టర్ తదితర ట్రేడ్ లలో ఐటీఐ పాసై ఉండాలి. ఇతర విద్యార్హతల వివరాలను ప్రకటనలో చూడొచ్చు.
    Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. 138 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి

    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ (https://careers.ecil.co.in/login.php) ను ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం ‘Click here to apply for Junior Technician on Contract positions against Advt. No. 13/2022’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 3: అనంతరం ‘Apply for Technical Officer on Contract Posts’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 4: అనంతరం కావాల్సిన వివరాలను నమోదు చేసి అప్లై చేసుకోవాలి.
    Step 5: దరఖాస్తు పూర్తియిన అనంతరం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, ECIL, Job notification, JOBS

    తదుపరి వార్తలు