ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీకి సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్ట్ ఇంజనీర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఇంటర్వ్యూలను జులై 6, 7 తేదీల్లో నిర్వహించనున్నారు. మొదటగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూలు ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా వాయిదా వేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీల్లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో సూచించారు. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో పని చేయాల్సి ఉంటుంది. MIDHANI Recruitment 2021: హైదరాబాద్ మిథానిలో ఉద్యోగాలు.. అప్లై చేయాల్సిన పని లేదు.. నేరుగా ఇంటర్వ్యూలే..
ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో 8, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో 12 ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. Assistant Project Engineer:ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లోమో చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ విద్యార్హతతో పాటు అభ్యర్థులు న్యూక్లియర్ కంట్రోల్ సిస్టెమ్స్ లో మూడేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి. ఇతర పూర్తి అర్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
Project Engineer:ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ట్రుమెంటేషన్ సబ్జెక్టుల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. మూడేళ్ల అనుభవం ఉండాలి. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
వేతనాల వివరాలు:
-ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40 వేల వేతనం అందించనున్నారు.
-అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 30 వేల వేతనం ఉంటుంది. Official Website - Direct Link
ఇంటర్వ్యూ వివరాలు..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చే నెల 06, 07 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని, పూర్తిగా నింపి వెంట తీసుకురావాల్సి ఉంది. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. ఇంటర్వ్యూలు నిర్వహించే చిరునామా: ECIL Regional Office, H.No. 47-09-28, Mukund Suvasa Apartments, 3rdLane Dwaraka Nagar, Visakhapatnam-530016.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.