Home /News /jobs /

ECIL RECRUITMENT 2021 NOTIFICATION RELEASED FOR 9 NEW VACANCIES SALARY RS 23000 HERE FULL DETAILS NS

ECIL Recruitment 2021: ఈసీఐఎల్ లో రూ. 23 వేల వేతనంతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరి కొన్ని గంటలే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్(Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ రోజు అంటే నవంబర్ 26ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా సంస్థ నుంచి నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. ఈ ఉద్యోగాలకు(Jobs) దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ నెల 19 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తుకు ఈ నెల 26ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో(Notification) స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. ప్రాజెక్టు అవసరాలు, అభ్యర్థుల పనితీరు ఆధారంగా కాంట్రాక్ట్ గడువును నాలుగేళ్ల పాటు పొడిగించే అవకాశం ఉందని నోటిఫికేషన్లో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 23 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.

    పోస్టులు, ఖాళీల వివరాలు..





















    S.Noపోస్టుఖాళీలుపని చేయాల్సిన ప్రదేశం
    (Work Location)
    1.టెక్నికల్ ఆఫీసర్ (Cat.1)/CnID8హైదరాబాద్
    2.టెక్నికల్ ఆఫీసర్(Cat.2)/SSPD1అహ్మదాబాద్

    విద్యార్హతల వివరాలు:
    టెక్నికల్ ఆఫసీర్ (Cat.1)/CnID: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ పొందిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    టెక్నికల్ ఆఫీసర్(Cat.2)/SSPD: కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ పొందిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు కనీసం ఏడాది పాటు embedded firmware developmentలో అనుభవం ఉండాలి. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    AP Job Mela: ఏపీలో భారీ జాబ్ మేళా.. 15 కంపెనీల్లో 1500 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

    వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు అక్టోబర్ 31 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    ఎంపిక విధానం: అప్లై చేసుకున్న అభ్యర్థులను మొదటగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అనంతరం వర్చువల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
    IT Jobs: ఐటీ రంగంలో కొలువుల జాతర.. వచ్చే ఏడాది భారత్‌లో 4.5 లక్షల ఉద్యోగాలు.. వివరాలివే

    అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Bank of Baroda Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 376 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు
    దరఖాస్తు విధానం..

    -ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 19న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది.
    -ఆ సమయం నుంచి అభ్యర్థులు ఆన్లైన్లో ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
    -దరఖాస్తుకు ఈ నెల 26ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 4 గంటలలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    -అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను ఈ లింక్ ద్వారా నోటిఫికేషన్ లో చూడొచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, ECIL, Government jobs, Govt Jobs 2021

    తదుపరి వార్తలు