ECIL RECRUITMENT 2021 FOR ENGINEERS IS BEING CONDUCTED FOR 650 TECHNICAL OFFICER VACANCIES SALARY RS 23000 HERE DETAILS NS
ECIL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ECILలో 650 ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్, ఇంటర్వ్యూ లేకుండానే..
ప్రతీకాత్మక చిత్రం
దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన సంస్థలల్లో ECIL ఒకటన్న విషయం తెలిసిందే. ఈ ప్రముఖ సంస్థ ఇటీవల వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. తాజాగా ఈ సంస్థ 650 ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతల వివరాలు..
ఫస్ట్ క్లాస్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ECE), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ఇతర అర్హతల వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. అభ్యర్థులు 30 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, బీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏడు రోజుల్లోపు ఈసీఐఎల్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. Official Notification-Direct Link Apply Online-Direct Link
ఎలా అప్లై చేయాలంటే..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 15 మధ్యాహ్నం 2 గంటలలోపు ఆన్లైన్ లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అప్లికేషన్లను సబ్మిట్ చేసిన అనంతరం అభ్యర్థులు అప్లికేషన్ ప్రింట్ కాపీని తీసుకోవాలి. అభ్యర్థుల బీటెక్ మార్కులు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.