ECIL Recruitment 2021: బీటెక్ పాస్ అయినవారికి హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ECIL Recruitment 2021: బీటెక్ పాస్ అయినవారికి హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

ECIL Recruitment 2021 | బీటెక్ పాస్ అయినవారికి గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-ECIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 8 పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. కాంట్రాక్ట్ గడువు రెండేళ్లు మాత్రమే ఉంటుంది. సంస్థ అవసరాలను బట్టి కాంట్రాక్ట్ గడువు పొడిగించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 25 చివరి తేదీ. ఎంపికైనవారికి హైదరాబాద్‌లోనే పోస్టింగ్ ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈసీఐఎల్ అధికారిక వెబ్‌సైట్ http://www.ecil.co.in/ లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

    ECIL Recruitment 2021: ఖాళీల వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 8
    టెక్నికల్ ఆఫీసర్ కేటగిరీ 1 ఎంసీడీ- 5
    టెక్నికల్ ఆఫీసర్ కేటగిరీ 2 ఈడీపీ- 2
    టెక్నికల్ ఆఫీసర్ కేటగిరీ 3 టీసీడీ- 1

    Digital India Jobs: డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

    7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్... పెన్షన్ భారీగా పెంపు

    ECIL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 16
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 25 సాయంత్రం 4 గంటలు
    విద్యార్హతలు- కేటగిరీ 1 పోస్టుకు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో, కేటగిరీ 2 పోస్టుకు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో, కేటగిరీ 3 పోస్టుకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి.
    వేతనం- నెలకు రూ.23,000.
    వయస్సు- 30 ఏళ్ల లోపు
    ఎంపిక విధానం- మెరిట్ ఆధారంగా 1:5 పద్ధతిలో ఎంపిక చేస్తారు. వర్చువల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

    Constable Jobs: మొత్తం 25,271 కానిస్టేబుల్ జాబ్స్... ఏం చదవాలంటే

    UBI Recruitment 2021: యూనియన్ బ్యాంక్‌లో 347 మేనేజర్ జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

    ECIL Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    అభ్యర్థులు ముందుగా http://www.ecil.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    హోమ్ పేజీలో కెరీర్స్ సెక్షన్‌లో e‐Recruitment పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
    అందులో Click here for details of Technical Officer on Contract positions against Advt. No. 27/2021 పైన క్లిక్ చేయాలి.
    తర్వాతి పేజీలో Apply for various Contract Posts పైన క్లిక్ చేయాలి.
    కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీరు అప్లై చేయాలనుకుంటున్న పోస్టు సెలెక్ట్ చేయాలి.
    అభ్యర్థి వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
    దరఖాస్తు ఫామ్ పూర్తి చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: