హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

ECIL Recruitment 2021: బీటెక్ పాస్ అయినవారికి హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 300 ఉద్యోగాలు

ECIL Recruitment 2021: బీటెక్ పాస్ అయినవారికి హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 300 ఉద్యోగాలు

ECIL Recruitment 2022

ECIL Recruitment 2022

ECIL Hyderabad Recruitment 2021 | హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ 300 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

  బీటెక్ పాస్ అయినవారికి గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 300 ఖాళీలున్నాయి. ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ డివిజన్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ పోస్టులున్నాయి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు. కాంట్రాక్ట్ గడువు ఒక ఏడాది మాత్రమే. ఈసీఐఎల్ అవసరాలు, అభ్యర్థుల పనితీరును బట్టి ఐదేళ్ల వరకు కాంట్రాక్ట్ పొడిగించొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 21 చివరి తేదీ. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

  ECIL Hyderabad Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  భర్తీ చేసే పోస్టు పేరు- టెక్నికల్ ఆఫీసర్

  మొత్తం ఖాళీలు- 300

  దరఖాస్తు ప్రారంభం- 2021 డిసెంబర్ 11

  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 21 సాయంత్రం 4 గంటలు

  డాక్యుమెంట్ వెరిఫికేషన్- తేదీలను త్వరలో ప్రకటించనున్న ఈసీఐఎల్

  విద్యార్హతలు- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి.

  అనుభవం- అభ్యర్థులకు ఒక ఏడాది అనుభవం ఉండాలి. అందులో కనీసం ఆరు నెలలు ఇండస్ట్రియల్ ఎక్స్‌పీరియెన్స్ ఉండాలి.

  వయస్సు- 2021 నవంబర్ 30 నాటికి 30 ఏళ్ల లోపు

  వేతనం- మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది నెలకు రూ.28,000, మూడో ఏడాది నుంచి ఐదో ఏడాది వరకు నెలకు రూ.31,000. అభ్యర్థులకు టీఏ, డీఏ లాంటి బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

  ఎంపిక విధానం- బీఈ లేదా బీటెక్‌లో వచ్చిన మార్కులు, అనుభవం ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించనున్న ఈసీఐఎల్.

  కాంట్రాక్ట్ గడువు- ఒక ఏడాది. ఐదేళ్ల వరకు కాంట్రాక్ట్ గడువు పొడిగించే అవకాశం ఉంది.

  ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

  ECIL Hyderabad Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా


  Step 1- అభ్యర్థులు ముందుగా http://www.ecil.co.in/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో టెక్నికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ క్లిక్ చేయాలి.

  Step 2- లేదా అభ్యర్థులు నేరుగా https://careers.ecil.co.in/advt3921.php లింక్ ఓపెన్ చేయాలి.

  Step 3- Apply for Technical Office on Contract Positions పైన క్లిక్ చేయాలి.

  Step 4- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీరు అప్లై చేయాలనుకుంటున్న పోస్టు సెలెక్ట్ చేయాలి.

  Step 5- అభ్యర్థి విద్యార్హతలు, ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి.

  Step 6- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.

  Step 7- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Central Government Jobs, ECIL, Govt Jobs 2021, Hyderabad, Job notification, JOBS, Telangana government jobs, Telangana jobs, Telugu updates, Telugu varthalu

  ఉత్తమ కథలు