• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • ECIL RECRUITMENT 2021 ELECTRONICS CORPORATION OF INDIA LIMITED HYDERABAD RELEASED JOB NOTIFICATION FOR 28 POSTS KNOW VACANCIES SS

ECIL Hyderabad Recruitment 2021: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ జాబ్ నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

ECIL Hyderabad Recruitment 2021: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ జాబ్ నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

ECIL Hyderabad Recruitment 2021: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ జాబ్ నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

ECIL Hyderabad Recruitment 2021 | బీటెక్, ఐటీఐ పాస్ అయినవారికి గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL ఇంజనీర్, టెక్నీషియన్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఈసీఐఎల్ యూనిట్లలో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 28 ఖాళీలు ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ, జూనియర్ ఆర్టిసన్ లాంటి పోస్టులున్నాయి. హైదరాబాద్‌తో పాటు చెన్నై, ముంబై, న్యూ ఢిల్లీలాంటి ప్రాంతాల్లో ఈ ఖాళీలున్నాయి. ఇవి రెండేళ్ల కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఆ తర్వాత ప్రాజెక్ట్ అవసరాలను బట్టి గడువు పొడిగిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 3 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.ecil.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోచ్చు. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ మొత్తం చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

    ECIL Hyderabad Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 28
    టెక్నికల్ ఆఫీసర్- 15
    సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ- 2
    జూనియర్ ఆర్టిసన్- 11

    Singareni Jobs 2021: సింగరేణిలో 372 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం... అప్లై చేయండిలా

    Common Eligibility Test: రైల్వే జాబ్స్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్... ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే

    ECIL Hyderabad Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 జనవరి 20
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 3
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ లాంటి బ్రాంచ్‌లల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. జూనియర్ ఆర్టిసన్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, రేడియో, టీవీ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ లాంటి విభాగాల్లో ఐటీఐ పాస్ కావాలి.
    వేతనం- టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు రూ.23,000, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టుకు రూ.20,202, జూనియర్ ఆర్టిసన్ పోస్టుకు రూ.18,382.
    వయస్సు- టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు 30 ఏళ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టుకు 25 ఏళ్లు, జూనియర్ ఆర్టిసన్ పోస్టుకు 25 ఏళ్లు.

    SSC CGL Notification 2021: డిగ్రీ పాసయ్యారా? 6506 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి... సిలబస్ ఇదే

    RBI Recruitment 2021: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 241 ఉద్యోగాలు

    ECIL Hyderabad Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    అభ్యర్థులు ముందుగా http://www.ecil.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    Careers సెక్షన్‌లో e‐Recruitment పైన క్లిక్ చేయాలి.
    అందులో నోటిఫికేషన్ సెలెక్ట్ చేయాలి.
    కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Apply for Various Posts పైన క్లిక్ చేయాలి.
    ఆ తర్వాత దరఖాస్తు చేయాలనుకునే పోస్టు సెలెక్ట్ చేయాలి.
    మీ పేరు, అడ్రస్, విద్యార్హతలు, ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
    దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: