Home /News /jobs /

ECIL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ECILలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

ECIL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ECILలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 17న నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు(Interviews) హాజరు కావాలని నోటిఫికేషన్లో తెలిపారు.

ఇంకా చదవండి ...
    ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జూనియర్ ఆర్టిసన్ (Junior Artisan) విభాగంలో ఈ నియామకాలు చేపట్టినట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ విభాగంలో 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ విధానంలో (Contract Basis) పని చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ గడువు ఏడాది అని నోటిఫికేషన్లో (Notification) స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ అవసరం, అభ్యర్థుల పర్ఫార్మెన్స్ ఆధారంగా కాంట్రాక్ట్ ను పొడిగిస్తారు.

    అర్హతల వివరాలు:
    -అధికారిక నోటిఫికేషన్ ప్రకారం జూనియర్ ఆర్టిసన్ ఉద్యోగాలకు రెండేళ్ల ఐటీఐ(ITI) కోర్సును ఫిట్టర్ ట్రేడ్(Fitter Trade)లో ఫస్ట్ క్లాస్ మార్కులతో పూర్తి చేసిన వారు  అప్లై చేసుకునేందుకు అర్హులు.
    -అభ్యర్థులకు ఏడాది పాటు పని చేసిన అనుభవం ఉండాలి.
    -అభ్యర్థుల వయస్సు ఆగస్టు 31 నాటికి 25 ఏళ్లు మించకుండా ఉండాలి.
    Railway Recruitment 2021: టెన్త్ పాస్ అయితే చాలు...పరీక్ష లేకుండానే రైల్వే జాబ్..ఇలా అప్లై చేయండి..

    -SC, ST, OBC అభ్యర్థులకు అర్హతల్లో కొన్ని మినహాయింపులు ఇచ్చారు.
    -ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు విద్యార్హత కోర్సులో అంటే ఐటీఐలో 50 శాతం మార్కులు ఉన్నా సరే అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
    -ఇంకా వయో పరిమితిలోనూ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
    -PWD అభ్యర్థులకు వయోపరిమితిలో పదేళ్ల పాటు సడలింపు ఇచ్చారు.
    -ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    WCL Recruitment 2021: వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,281 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Salary Details:  ఈ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,564 చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు.

    ఎలా అప్లై చేయాలంటే (How to Apply):
    Step 1: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ECIL వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ (Application Form) ను డౌన్ లోడ్ చేయాలి.
    Step 2: అనంతరం ఆ అప్లికేషన్ ఫామ్ ను నింపాలి.
    Step 3: ఈ నెల 17న ఉదయం 10 గంటలకు ECIL Zonal Office, number 1/1, second floor, LIC Building, Sampige Road, Malleswaram, Bengaluru 560 003 చిరునామాలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
    Step 4: ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫామ్ తో పాటు, అర్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు ఒక సెట్ సెల్ఫ్ అటెస్ట్ చేసిన సర్టిఫికేట్ల కాపీలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: ECIL, Government jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు