ECIL Recruitment 2021 | హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ (ECIL) భారీగా ఖాళీలను భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి మరో 2 రోజులే గడువుంది. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు (ECIL Jobs) సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
హైదరాబాద్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీకి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. అప్రెంటీస్‌షిప్ యాక్ట్ 1961 కింద ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్‌షిప్ (Apprentice Jobs) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఈ పోస్టులున్నాయి. మొత్తం 243 పోస్టుల్ని ప్రకటించింది. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, మెషనిస్ట్, కార్పెంటర్ లాంటి పోస్టులున్నాయి. ఇవి ఒక ఏడాది వ్యవధి గల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఖాళీలు, నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలతో పాటు ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.
Step 1- అభ్యర్థులు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్-MSDE అప్రెంటీస్ వెబ్సైట్ https://apprenticeshipindia.org/ లో మొదట రిజిస్టర్ చేయాలి.
Step 2- ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఈసీఐఎల్ అధికారిక వెబ్సైట్ http://www.ecil.co.in/ లో కెరీర్స్‌లో e-recruitment పైన క్లిక్ చేయాలి.
Step 6- MSDE రిజిస్ట్రేషన్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ లాంటి వివరాలతో రిజిస్టర్ చేయాలి.
Step 7- దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే స్థలం:
ELECTRONICS CORPORATION OF INDIA LIMITED,
Corporate Learning & Development Centre (CLDC),
Nalanda Complex, TIFR Road,
ECIL Hyderabad – 500 062.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.