Home /News /jobs /

ECIL RECRUITMENT 2021 APPLICATION PROCESS BEGINS FOR 9 POSTS IN ELECTRONICS CORPORATION OF INDIA LIMITED HYDERABAD SS

ECIL Recruitment 2021: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే

ECIL Recruitment 2021: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

ECIL Recruitment 2021: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

ECIL Hyderabad Recruitment 2021 | హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. తాజాగా మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

    హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 9 ఖాళీలున్నాయి. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ యూనిట్‌లో ఈ ఖాళీలున్నాయి. ఇవి ఏడాది గడువున్న కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఆ తర్వాత ప్రాజెక్ట్ అవసరాలను బట్టి గడువు పొడిగించే అవకాశం ఉంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతల వివరాలు తెలుసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2021 మార్చి 18 లోగా దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://www.ecil.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి.

    ECIL Hyderabad Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 9
    టెక్నికల్ ఆఫీసర్- 8
    సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ- 1

    DSSSB Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... 1809 ఉద్యోగాలకు అప్లై చేయండిలా

    NTA Recruitment 2021: ఇంటర్, డిగ్రీ, పీజీ పాసయ్యారా? 1145 పోస్టులకు అప్లై చేయండి

    ECIL Hyderabad Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 మార్చి 4
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 18
    డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ- తేదీలను త్వరలో వెల్లడించనున్న ఈసీఐఎల్
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి.
    వేతనం- టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు రూ.23,000, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టుకు రూ.20,202.
    వయస్సు- టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు 30 ఏళ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టుకు 25 ఏళ్లు.

    ESIC Recruitment 2021: ఈఎస్ఐలో మెగా రిక్రూట్‌మెంట్... మొత్తం 6,552 ఖాళీలు

    SSC MTS Recruitment 2021: టెన్త్ పాస్ అయ్యారా? ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

    ECIL Hyderabad Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    అభ్యర్థులు ముందుగా http://www.ecil.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    Careers సెక్షన్‌లో e‐Recruitment పైన క్లిక్ చేయాలి.
    అందులో నోటిఫికేషన్ సెలెక్ట్ చేయాలి.
    కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Apply for Various Posts పైన క్లిక్ చేయాలి.
    ఆ తర్వాత దరఖాస్తు చేయాలనుకునే పోస్టు సెలెక్ట్ చేయాలి.
    మీ పేరు, అడ్రస్, విద్యార్హతలు, ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
    దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, ECIL, Exams, Govt Jobs 2021, Hyderabad, Hyderabad news, Job notification, JOBS, NOTIFICATION

    తదుపరి వార్తలు