ECIL Recruitment 2020: ఈసీఐఎల్‌లో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... హైదరాబాద్‌లో ఖాళీలు

ECIL Recruitment 2020 | హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ దేశవ్యాప్తంగా పలు ఖాళీల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి.

news18-telugu
Updated: October 27, 2020, 4:28 PM IST
ECIL Recruitment 2020: ఈసీఐఎల్‌లో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... హైదరాబాద్‌లో ఖాళీలు
ECIL Recruitment 2020: ఈసీఐఎల్‌లో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... హైదరాబాద్‌లో ఖాళీలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్ల ద్వారా ఖాళీలను భర్తీ చేసింది ఈసీఐఎల్. ఇప్పుడు మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ ఆఫీసర్, లైజన్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 25 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 అక్టోబర్ 23న ప్రారంభమైంది. అప్లై చేయడానికి నవంబర్ 3 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం http://www.ecil.co.in/ వెబ్‌సైట్ చూడాలి. నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు https://careers.ecil.co.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

IBPS PO Recruitment 2020: గుడ్ న్యూస్... 3517 బ్యాంకు ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్

UCO Bank Jobs: యూకో బ్యాంకులో 91 ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు

ECIL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 25

టెక్నికల్ ఆఫీసర్- 24
హైదరాబాద్- 11

బఠిండా- 8
న్యూ ఢిల్లీ- 1
ముంబై- 3
లోనావాలా- 1

లైజన్ ఆఫీసర్- 1
బఠిండా- 1

SSC Recruitment 2020: గుడ్ న్యూస్... ఇంటర్ పాసైనవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Railway Jobs: మొత్తం 1,03,769 ఖాళీల భర్తీ విషయంలో రైల్వే కీలక నిర్ణయం

ECIL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 అక్టోబర్ 23
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 3 మధ్యాహ్నం 2 గంటలు
డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ- త్వరలో వెల్లడించనున్న ఈసీఐఎల్.
విద్యార్హతలు- టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. లైజన్ ఆఫీసర్ పోస్టుకు ఇండియన్ ఆర్మీలో కల్నల్, లెఫ్టనెంట్ కల్నల్‌గా రిటైరైనవారు అర్హులు. ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. కనీసం 15 ఏళ్లు అనుభవం ఉండాలి.
వయస్సు- టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు 2020 సెప్టెంబర్ 30 నాటికి 30 ఏళ్ల లోపు. లైజన్ ఆఫీసర్ పోస్టుకు 60 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం- మార్కుల ఆధారంగా దరఖాస్తుల్ని 1:4 ప్రకారం షార్ట్ లిస్ట్ చేచేస్తారు. అభ్యర్థులకు వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
వేతనం- టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.23,000. లైజన్ ఆఫీసర్‌కు రూ.75,000.

ECIL Recruitment 2020: అప్లై చేయండి ఇలా


అభ్యర్థులు ముందుగా http://www.ecil.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
Careers సెక్షన్‌లో e‐Recruitment పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి.
ఆ తర్వాత Apply for various posts పైన క్లిక్ చేయండి.
అడ్వర్టైజ్‌మెంట్ నెంబర్, పోస్ట్ పేరు సెలెక్ట్ చేయాలి.
మీ పేరు, వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
Published by: Santhosh Kumar S
First published: October 27, 2020, 4:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading