HOME »NEWS »JOBS & EDUCATION »ecil recruitment 2020 electronics corporation of india limited hyderabad released notification for 65 posts know vacancies ss

ECIL Recruitment 2020: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ECIL Recruitment 2020: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
ECIL Recruitment 2020: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

ECIL Recruitment 2020 | నిరుద్యోగులకు శుభవార్త. పలు ఖాళీల భర్తీకి హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • Share this:
    ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ఆర్టిసన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 65 ఖాళీలను ప్రకటించింది. ఇవి రెండేళ్ల కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఆ తర్వాత అవసరాలను బట్టి గడువును పొడిగించే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు కోట, కైగా, తారాపూర్, మంగళూరు, చెన్నై, కొచ్చిన్ సహా ఇతర ప్రాంతాల్లోని ఈసీఐఎల్ యూనిట్లలో వీరిని నియమించుకోనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 2 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.ecil.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అప్లై చేసేముందు నోటిఫికేషన్ చదివి అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.

    IIT Hyderabad Recruitment 2020: హైదరాబాద్ ఐఐటీలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా



    BEL Recruitment 2020: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 78 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు

    ECIL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 65
    టెక్నికల్ ఆఫీసర్- 24
    సైంటిఫిక్ అసిస్టెంట్- 13
    జూనియర్ ఆర్టిసన్- 28

    ECIL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2020 అక్టోబర్ 19
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 2 మధ్యాహ్నం 2 గంటలు
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
    ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, మెరిట్, ఇంటర్వ్యూ
    వేతనం- టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు రూ.23,000, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుకు రూ.19,864, జూనియర్ ఆర్టిసన్ పోస్టుకు రూ.18,070.

    Jobs: ఈ కోర్సు చేసినవారికి లక్ష ఉద్యోగాలు... కరోనా వైరస్ ఎఫెక్ట్

    Job Loss: కరోనా కాలంలో ఉద్యోగం పోతే ప్రభుత్వం నుంచి సాయం... పథకాన్ని పొడిగించిన కేంద్రం

    ECIL Recruitment 2020: దరఖాస్తు చేయండి ఇలా


    అభ్యర్థులు ముందుగా http://www.ecil.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    ఆ తర్వాత Careers సెక్షన్ క్లిక్ చేసి e-recruitment పైన క్లిక్ చేయాలి.
    Contract position నోటిఫికేషన్ లింక్ పైన క్లిక్ చేయాలి.
    నెక్స్‌ట్ పేజీలో అడ్వర్‌టైజ్‌మెంట్, అప్లికేషన్ లింక్ ఉంటుంది.
    Apply for various posts పైన క్లిక్ చేసి పోస్టు సెలెక్ట్ చేసి అప్లై చేయాలి.
    Published by:Santhosh Kumar S
    First published:October 20, 2020, 19:49 IST